విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టుని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.150 కోట్ల బడ్జెట్ అవుతుందని అంటున్నారు. అందుకే రెండు భాగాలుగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అదే డేట్ కి నితిన్ (Nithiin) ‘రాబిన్ హుడ్’ (Robinhood) ని అనౌన్స్ చేశారు. మరోపక్క నాగవంశీ నిర్మిస్తోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ ని మార్చి 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. వెంటనే ‘VD 12’ రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇవ్వాలని నాగవంశీకి రిక్వెస్ట్..లు పెట్టుకుంటూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. అయినా సరే నాగవంశీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.
దీంతో అతన్ని ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇన్సైడ్ సర్కిల్స్ ప్రకారం..’VD12′ రెండు నెలలు పోస్ట్ పోన్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మే 30న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.త్వరలోనే అధికారికంగా ఈ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా ఇది పెద్ద హిట్ అయ్యి.. విజయ్ ని ప్లాపుల నుండి గట్టెక్కిస్తుంది అని వారు ఆశిస్తున్నారు.