ఫలానా హీరోయిన్ ఫలానా హీరోతో డేటింగ్ చేస్తుందనో లేక ఇంకో రిలేషన్ మెయింటైన్ చేస్తుందనో మనం వెబ్ సైట్స్ లో కనీసం రెండుమూడు రోజులకొకసారైనా వింటూనే, చూస్తూనే ఉంటాం. ఆ రిలేషన్స్ లో ఎన్ని నిజం, ఎన్ని అబద్ధం అనేది ఫైనల్ గా తెలిసేసరికి చాలా ఏళ్ళైపోతుంది. అయితే.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ నటుడు జోనాస్ తో సాగిస్తున్న ప్రేమాయణం కేవలం ప్రచారం కోసమేనని తెలుస్తోంది.
తనకంటే 11 ఏళ్ళు వయసులో చిన్నవాడైన జోనాస్ ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో పేరు తెచ్చుకొంటున్నాడు. ఈ తరుణంలో ప్రియాంక అతడితో కేవలం అటెన్షన్ కోసం తిరుగుతోందని వినికిడి. అసలే హాలీవుడ్ లో కొత్త సినిమాలేవీ సైన్ చేయకపోవడం… అక్కడ దుకాణం సర్దేసి బాలీవుడ్ కి బయల్దేరాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ప్రియాంక ఇలాంటి తింగరి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోందని చెప్పుకొంటున్నారు.