‘AAA’ సినిమా గ్లింప్స్‌తో మ్యాజిక్‌ చేసిన ఈ 20 ఏళ్ల కుర్రాడి గురించి తెలుసా?

అల్లు అర్జున్‌ (Allu Arjun) కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో వచ్చింది చూసే ఉంటారు. అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో రూపొందనున్న ఆ సినిమాకు సంబంధించి ప్రకటన, కాన్సెప్ట్‌ అనౌన్స్‌మెంట్‌ కలిపి ఆ వీడియోను సిద్ధం చేశారు. మరి ఈ సినిమా మ్యూజిక్‌ ఎవరు అనుకుంటున్నారు? ఏముంది అట్లీ సినిమా కదా అనిరుథ్‌ రవిచందర్‌ (Anirudh Ravichander) అయి ఉంటాడు అని కాన్ఫిడెంట్‌గా చెప్పేయకండి. ఎందుకంటే ఈ సినిమాకు సంగీతం ఆయన కాదు అని అంటున్నారు. అనౌన్స్‌మెంట్‌ వీడియో మ్యూజిక్‌ ఇచ్చిన కుర్రాడే సినిమాకూ చేయొచ్చు అని ఓ టాక్‌.

Sai Abhayankar

AAA (అల్లు అర్జున్‌ – అట్లీ) కాంబినేషన్‌ సినిమా అనేసరికి కాస్త పరిచయం ఉన్న, అలవాటు ఉన్న సంగీత దర్శకుడిని తీసుకుంటారు అని అనుకున్నారంతా. ఈ క్రమంలో అనిరుథ్‌, తమన్‌ (S.S.Thaman), దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) లాంటి పేర్లు వచ్చాయి. ఆ ఇద్దరికి ఈ ముగ్గురు బాగా క్లోజ్‌ కాబట్టి. అయితే వాళ్లెవరికీ కాకుండా అనౌన్స్‌మెంట్‌ వీడియోకు సాయి అభయంకర్‌ను తీసుకున్నారు. ఈయన సంగీత దర్శకుడిగా కొత్త కానీ.. సంగీతానికి ఈయన, ఈయనకు సంగీతం కొత్త కాదు. సాయి అభయంకర్‌ (Sai Abhayankar) తండ్రి మనకు బాగా తెలిసినరే.

అతని పేరు టిప్పు. అవును తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన టిప్పు కుమారుడే సాయి అభయంకర్‌. ఇక తల్లి కూడా మనకు పరిచయమే. ఆమె పాపులర్ సింగర్ హరిణి. ఇక సాయి విషయానికొస్తే.. కంపోజ్ చేసిన సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ‘కట్చి సేరి’ అంటూ ఆయన స్వరపరిచిన పాటకు యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఆ తర్వాత చేసిన ‘ఆశ కూడా’ 245 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)  ఆడి పాడిన సింగిల్ సాంగ్‌ ‘సితిరా పుతిరి..’ కి కూడా సాయి సంగీత దర్శకుడు.

ఇక ‘దేవర’ (Devara), ‘కూలీ’ (Coolie) లాంటి సినిమాలకు అనిరుధ్ రవిచందర్ టీమ్‌లో పని చేశారు. లారెన్స్ (Raghava Lawrence) – బక్కియరాజ్ కణ్నన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘బెంజ్’కి సాయి అభయంకరే మ్యూజిక్‌ డైరక్టర్‌. సూర్య (Suriya) – ఆర్జే బాలాజీ (RJ Balaji) సినిమా, ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) – మమితా బైజు (Mamitha Baiju) సినిమాలకూ ఆయనే. ఇందాకటి నుండి కుర్రాడు కుర్రాడు అంటున్న వయసెంత అని చెప్పలేదనేగా మీ ఆఖరి ప్రశ్న. అతని వయసు 20 ఏళ్లే. ఇక్కడో మాట టీజర్‌ వీడియోకి మాత్రమే సాయి (Sai Abhayankar) మ్యూజిక్‌ ఇచ్చారు. సినిమాకు కూడా తీసుకుంటారా లేదా అనేది సినిమా ఓపెనింగ్‌ రోజు తేలుతుంది.

‘జాక్’ ‘జాట్’ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఆ టికెట్ రేట్లు ఏంటి బాబు..?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus