‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నుండి వస్తున్న ‘జాక్’ (Jack) పై మంచి అంచనాలే ఉన్నాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) తో ఫామ్లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) ఈ సినిమాకి దర్శకుడు. ‘బేబీ’ తో (Baby) వంద కోట్ల క్లబ్లో చేరిన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్ గా నటిస్తుంది. ‘విరూపాక్ష’ (Virupaksha) వంటి రూ.100 కోట్ల సినిమాని అందించిన ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(SVCC) బ్యానర్ అధినేతలు బీవీఎస్ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad), బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రేజీ కాంబినేషన్లో కావడంతో ట్రేడ్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, భాగ్య నగరం(కిస్) పాటకి… ఆడియన్స్ ని మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఆల్రెడీ ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులకు చిత్ర బృందం స్పెషల్ స్క్రీనింగ్ వేసి సినిమాను చూపించడం జరిగింది. తర్వాత చూసిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
వారి టాక్ ప్రకారం.. సినిమా రన్ టైం 2 గంటల 10 నిమిషాలు ఉందట. హీరో సిద్దు ఇంట్రో, వైష్ణవి ఇంట్రో బాగుంటాయట. సీనియర్ నరేష్ (Naresh) కామెడీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ వంటి అలరిస్తాయట. సెకండాఫ్లో వచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్ థ్రిల్ చేస్తాయట. యాక్షన్ ఎపిసోడ్స్ ను అలాగే సాంగ్స్ ని బాగా పిక్చరైజ్ చేశారు అని అంటున్నారు. క్లైమాక్స్ లో చిన్నపాటి మెసేజ్ కూడా ఉందని అంటున్నారు. మరి రిలీజ్ రోజున మార్నింగ్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.