Odela 2 Trailer Review: తమన్నా నట విశ్వరూపం చూపించిందిగా!

లాక్ డౌన్ టైమ్ లో వచ్చిన “ఓదెల రైల్వే స్టేషన్”(Odela Railway Station) ఎవ్వరూ ఊహించని స్థాయిలో హిట్ అయ్యి ఆహా యాప్ కి, ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కాస్త హింస, Sruరం ఎక్కువైనా జనాలు ఆస్వాదించారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు సంపత్ నంది(Sampath Nandi) . సీక్వెల్ కి తమన్నాని  (Tamannaah Bhatia) యాడ్ చేయడంతోనే సినిమా రేంజ్ పెరిగిపోయింది. తమన్నా శివశక్తిగా నటిస్తుండడం, సినిమాలో భారీ వీఎఫ్ఎక్స్ కి స్కోప్ ఉండడంతో ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Odela 2 Trailer Review:

ఆ ప్రమోషన్స్ లో భాగంగానే ఇవాళ ముంబైలో “ఓదెల 2” (Odela 2) ట్రైలర్ ను విడుదల చేశారు. ఆల్రెడీ టీజర్ లోనే సినిమా థీమ్ ఏమిటి అనేది క్లారిటీ ఇచ్చేసిన చిత్రబృందం, ట్రైలర్ తో తమ సినిమా స్థాయి ఏమిటి అనేది ఎలివేట్ చేసింది. హారర్ & డివోషనల్ ఎలిమెంట్స్ ను మేళవించి కట్ చేసిన ఈ ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం ఖాయం. మరీ ముఖ్యంగా “ఊసరవెల్లి” తర్వాత తమన్నా మళ్లీ తన నట విశ్వరూపం ఈ చిత్రంలోనే చూపించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

శివుడి గురించి చెప్పే డైలాగ్స్ & సీజీ వర్క్ చాలా బాగున్నాయి. చూస్తుంటే.. ఏప్రిల్ 17న విడుదలకానున్న ఈ చిత్రంతో తమన్నా తన మూడో ఇన్నింగ్స్ కు ఘనంగా శ్రీకారం చుట్టనుందనే అనిపిస్తోంది. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ(Ashok Teja) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మధు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 18న విడుదలవుతున్న “సారంగపాణి జాతకం(Sarangapani Jathakam) , అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun Son Of Vyjayanthi)” సినిమాలకు “ఓదెల 2” గట్టి పోటీ ఇచ్చేలానే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus