నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బాబీ కొల్లి (Bobby) దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’Daaku Maharaaj) సి అనే సినిమా రూపొందుతుంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి, శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ వంటి హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. కానీ బాలయ్యకి ఎవరు జోడీగా చేస్తున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా.. జనవరి 12న సంక్రాంతి కానుకగా ‘డాకు మహారాజ్’ రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా తక్కువగా చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా గురించి చాలా డౌట్స్ మీడియాలో, ఆడియన్స్ లో ఉన్నాయి. టైటిల్ వినడానికి చాలా కొత్తగా ఉంది? దాని అర్థం ఏంటి? మాస్ ఆడియన్స్ కి ఈ టైటిల్ రీచ్ అవుతుందా లేదా? వంటి విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కానీ ఏదీ రివీల్ చేయకూడదు అని టీం డిసైడ్ అయినట్టు ఉన్నారు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే..
ఈ సినిమా కథ ప్రకారం ఇంకో హీరో అవసరం ఉంటుందట. గతంలో విశ్వక్ సేన్ ని ఆ పాత్రకి అడిగారు.అతనికంటే ముందు నానిని కూడా సంప్రదించినట్లు టాక్ నడిచింది. ఫైనల్ గా దుల్కర్ సల్మాన్ తో ఆ పాత్ర చేయిస్తున్నట్టు టాక్ నడిచింది. కానీ దానిపై ఎటువంటి క్లారిటీ టీం ఇచ్చింది లేదు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. దాని గురించి టీం ఎటువంటి హింట్ ఇవ్వట్లేదు. బహుశా థియేటర్లలో ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీలవుతారు? అని మేకర్స్ దాస్తున్నారా? లేక ఆ పాత్రని లేపేసి స్క్రిప్ట్ ను కూడా మార్చేశారా? అనేది తెలియాల్సి ఉంది.