Manchu Vishnu Vs Manchu Manoj: మళ్ళీ మొదటికి వచ్చిన మంచు వారి గొడవలు!

మంచు మనోజ్ కి అతని తండ్రి మోహన్ బాబు, మంచు విష్ణు..ల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆస్తుల విషయంలో వీరి మధ్య ఏర్పడ్డ తగాదాలు.. పోలీస్ స్టేషన్ కి, మీడియా కి పాకాయి. ఈ క్రమంలో మోహన్ బాబు పై మనోజ్.., అలాగే మనోజ్.. అతని భార్య మౌనిక పై మోహన్ బాబు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన గొడవలు, మోహన్ బాబు.. మంచు విష్ణు..ల పై చేసిన ఆరోపణలు కూడా అందరికీ తెలుసు.

Manchu Vishnu Vs Manchu Manoj

అయితే రెండు రోజుల క్రితం మనోజ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది. కానీ మనోజ్ చివరి నిమిషంలో ప్రెస్ మీట్ కాన్సిల్ చేశాడు. దీంతో ఆ గొడవలకి హ్యాపీ ఎండింగ్ పడినట్టే అని అంతా అనుకున్నారు. కానీ గొడవలు మళ్ళీ మొదటికి వచ్చాయని మనోజ్ ఈరోజు పోలీసుల వద్దకి వెళ్లడం వల్ల బయట పడింది. వివరాల్లోకి వెళితే..మంచు మనోజ్ నిన్న రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నాడట. తన తల్లి నిర్మలా దేవి పుట్టినరోజు సందర్భంగా మనోజ్ కేక్ కటింగ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో వారు 5 జనరేటర్‌లు ఏర్పాటు చేసుకోగా ఒక జనరేటర్‌లో పంచదార పోసి పాడు చేశారని తెలుస్తుంది. అలా చేసింది మరెవరో కాదు మంచు విష్ణు అండ్ టీం అని తెలుస్తుంది. జల్‌పల్లిలోని మనోజ్ నివాసంలో ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది.దీంతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య మళ్ళీ గొడవ మొదలైనట్టు సమాచారం.

స్వయంగా మంచు విష్ణు ఆధారాలతో సహా ఏ విషయంపై పోలీసులకి కంప్లయింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. జనరేటర్ లో విష్ణు అనుచరులు పంచదార పోసిన విజువల్స్ కూడా మనం కింద చూడవచ్చు.

రష్మిక రెమ్యునరేషన్ గేమ్.. పుష్ప 2 తర్వాత కొత్త లెక్కలు!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus