Bigg Boss 8 Telugu Winner Nikhil: బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ కి .. ఎన్ని లక్షల ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా?

2024 సెప్టెంబర్ 01న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8న ఈరోజుతో ముగియనన్నది. అవును ఈరోజు అనగా బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే. సీజన్ 8 విజేతను ప్రకటించే రోజు. 22 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్ లో పాల్గొన్నారు. ప్రతిసారీ విన్నర్ కి రూ.50 లక్షలు క్యాష్ ప్రైజ్ ఇస్తాడు బిగ్ బాస్. ఈసారి మాత్రం రూ.55 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించాడు. అలాగే మారుతీ సుజూకీ కారుని కూడా ఇవ్వబోతున్నారు అని టాక్ నడిచింది.

Bigg Boss 8 Telugu Winner Nikhil

అయితే టాప్ 5 కి చేరింది గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు. వీళ్లలో విన్నర్ ఎవరు అనే ఉత్కంఠత నెలకొంది. ఈసారి విన్నర్ రేసులో నిఖిల్, గౌతమ్‌ లు నిలబడ్డారు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నిఖిల్, గౌతమ్.. లు టాప్ 2 అని తెలిసింది.

వారిని స్టేజ్ పైకి తీసుకువచ్చి.. కొద్దిసేపటికి నిఖిల్ ను విన్నర్ గా ప్రకటించారు నాగార్జున. ఇక విన్నర్ ట్రోఫీని గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ బహుకరించారు. అలాగే రూ.55 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా నిఖిల్ కి లభించింది. దీంతో పాటు అతనికి పారితోషికం అదనముగా వస్తుంది.

నిఖిల్ మొదటి నుండీ గేమ్ సిన్సియర్ గా ఆడుతూ వచ్చాడు. టాస్క్.ల విషయంలో అతను ఫ్రెండ్ షిప్ ను కూడా పక్కన పెట్టడం ఆడియన్స్ కి నచ్చింది. అందుకే నామినేషన్స్ కి వచ్చిన ప్రతిసారి అతను ఎక్కువ ఓట్లుతో సేఫ్ అయ్యాడు. ఫైనల్ గా విన్నర్ అయ్యాడు.

ఘనంగా కీరవాణి కొడుకు సింహా పెళ్ళి.. ఫోటోలు వైరల్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus