Tollywood: టాలీవుడ్ నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకనుందా?

ఒకప్పుడు టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా చిరంజీవి పేరు వినిపించేది. చిరంజీవి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించాయి. అయితే చిరంజీవి సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లడంతో లెక్కలు మారిపోయాయి. ప్రస్తుతం యంగ్ జనరేషన్ హీరోల హవా నడుస్తోంది. ఈ హీరోలలో ఏ హీరో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయా హీరోలకు ఉన్నాయి. ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు ప్రస్తుతం క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

ప్రభాస్ సలార్1 డిసెంబర్ నెల 22వ తేదీన రిలీజ్ కానుండగా సలార్2 రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ దేవర, వార్2 సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నారు.

చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు బుచ్చిబాబు సినిమాతో ఉన్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాలలో ఏ సినిమా కలెక్షన్ల విషయంలో, అవార్డుల విషయంలో రికార్డులు సృష్టిస్తుందో ఆ హీరోనే నంబర్ వన్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. అందరు హీరోలకు నంబర్ వన్ హీరో అయ్యే అర్హతలు ఉండగా ఏ హీరో ఆ లక్కీ ఛాన్స్ ను సొంతం చేసుకుంతారో చూడాల్సి ఉంది.

ఈ హీరోలలో (Tollywood) కొంతమంది హీరోలకు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఈ హీరోల సినిమాలకు జరిగే బిజినెస్ కూడా చర్చకు వస్తోంది. టాలీవుడ్ స్టార్స్ కనీవినీ ఎరుగని రికార్డులను సొంతం చేసుకుని మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus