కాజల్ ని ప్రేమలో దించడానికి ప్రయత్నించిన హీరో ఎవరు ?

ముంబై నుంచి వచ్చినప్పటికీ కాజల్ తన తన నటనతో తెలుగింటి అమ్మాయిగా పేరుతెచ్చుకుంది. బాలీవుడ్, కోలీవుడ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. దాదాపు యువ హీరోలందరితో కలిసి నటించింది. మెగాస్టార్ చిరంజీవితోను కలిసి స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈమె క్వీన్ రీమేక్ లో నటిస్తోంది. ఈ మధ్య ఓ అవార్డుల కార్య‌క్రమానికి కాజల్ హాట్ డ్రెస్‌తో హాజరై అదరగొట్టింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనతో నటించిన హీరోల్లోని ప్రత్యేక క్వాలిటీస్ గురించి వెల్లడించింది. “నేను చాలా మంది హీరోలతో క‌లిసి పనిచేశాను. కానీ నా దృష్టిల్లో వాళ్లంద‌రి కంటే చిరంజీవి చాలా రొమాంటిక్‌” అని చెప్పింది. ఇంకా మాట్లాడుతూ… “అల్లు అర్జున్ నిజంగానే స్టైలిష్ స్టార్. ఫ్యాష‌న్స్‌ను, ట్రెండ్స్‌ను ఫాలో కావ‌డంలో బ‌న్నీని మించిన వారెవ‌రూ లేరు.

తెలుగు హీరోల్లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చాలా కామ్. సైలెంట్‌గా ఉండ‌డ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. అయితే మ‌హేష్‌కు సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఎక్కువ‌ ఆయ‌న‌ మాట్లాడితే మాత్రం న‌వ్వ‌కుండా ఉండలేము” అని వివరించింది. మరి ఎవరైనా మిమ్మల్ని ప్రేమించడానికి ప్రయత్నించలేదా ? అని అడిగితే.. తడుముకోకుండా నవదీప్ పేరు చెప్పింది. కాజల్ నవదీప్ తో కలిసి చందమామ సినిమాలో నటించింది. “ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ నన్ను ప‌డేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌లేదు, న‌వ‌దీప్ మాత్రం ప్ర‌య‌త్నించాడు” అని కాజ‌ల్ నవ్వేసింది. ఇప్పటివరకు కాజల్ తన పరిమితుల్లో ఉంటూ కెరీర్ ని సక్రమంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus