టాప్ – 5 లో ఉండేది వీళ్లేనా ? అరియానాకి ఛాన్స్ లేదా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి బాబాభాస్కర్ వచ్చాక లెక్కలు మారిపోయాయి. అప్పటివరకూ టాప్ 5కి ఖచ్చితంగా వెళ్తారు అనుకున్న హౌస్ మేట్స్ ఇప్పుడు ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో పడ్డారు. ప్రస్తుతం హౌస్ లో 8మంది ఉన్నారు. వీళ్లలో టాప్ – 5 లేదా టాప్ – 6 కి వెళ్లాలంటే ఖచ్చితంగా వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ జరగాల్సిందే. నటరాజ్ మాస్టర్, బాబాభాస్కర్, అనిల్, అఖిల్, శివ, బిందుమాధవి, మిత్రా శర్మా, ఇంకా అరియానాలు ఉన్నారు.

వీళ్లలో ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే హౌస్ మేట్స్ ఓటింగ్ తో వెళ్లే అవకాశం ఇస్తే ఖచ్చితంగా అది అన్ ఫెయిర్ అవుతుంది. అలాగే, బాబాభాస్కర్ ని ఎలిమినేట్ చేయాలన్నా కూడా సరైన రీజన్ చూపించాలి. లేదంటే మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకులు అసహనానికి గురి అవుతారు. అందుకే, ఈసారి నామినేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది ఆసక్తికరం. ఇక మరోవైపు అరియానా రెండు వారాల పాటు డేంజర్ జోన్ లో ఉంది.

అనిల్ రాధోడ్, నటరాజ్ మాస్టర్, అరియానా ఈ ముగ్గురు ఈవారం డేంజర్ లోనే ఉన్నారు. నిజానికి మిత్రా శర్మా లీస్ట్ లో ఉండాలి. కానీ, తన గేమ్ తోనే బయట ప్రేక్షకులని ఆకట్టుకుంది. అందుకే, టాప్ – 5 వరకూ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అనిల్ రాధోడ్, నటరాజ్ మాస్టర్, అరియానా ఈ ముగ్గురు ఇప్పుడు ఎలిమినేషన్ ని ఎదుర్కోబోతున్నారా అనే అనిపిస్తోంది. అయితే, బాబాభాస్కర్ దగ్గర ఉన్న ఎవిక్షన్ ప్రీ పాస్ ని నటరాజ్ మాస్టర్ కోసం వాడితే మాత్రం మాస్టర్ సేఫ్ అయిపోతారు.

టాప్ 5లోకి వెళ్తారు. అప్పుడు అనిల్ రాధోడ్, ఇంకా అరియానాలు మాత్రమే ఉంటారు. వీరిద్దరూ టాప్ – 5కి వచ్చే ఛాన్సెస్ కనిపించడం లేదు. ముఖ్యంగా అరియానా రెండు సార్లు ఎలిమినేషన్ ని తప్పించుకుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అరియానా లాస్ట్ సీజన్ లో లాగా టాప్ 5కి చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో అనిల్, ఇంకా అరియానాలకి మాత్రమే ఎలిమినేషన్ గండం అనేది కనిపిస్తోంది.

అందుకే, అరియానా టాప్ – 5 కి వెళ్లే ఛాన్స్ లేదంటూ బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ ఎలిమినేట్ అయితే మాత్రం టాప్ – 6 మెంబర్స్ ఫినాలేకి వెళ్తారనే అనిపిస్తోంది. ఈవారం హౌస్ మేట్స్ మొత్తాన్ని బిగ్ బాస్ నామినేట్ చేస్తే డబుల్ ఎలిమినేషన్ అనేది ఉంటే వీరిద్దరూ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని జోస్యం చెప్తున్నారు. అదీ మేటర్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus