సినిమా నిర్మాతకు శాటిలైట్ రైట్స్ చాలా ప్లస్ పాయంట్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో అంటే శాటిలైట్ రైట్స్ కు పెద్దగా ప్రాముఖ్యత ఉండేడికాదు కానీ, ఇప్పుడున్న టెక్నాలజీ పుణ్యమా అంటూ సినిమా శాటిలైట్ రైట్స్ భారీగా పెరిగిపోయాయి. అందులో భాగంగా, ఒక్క సినిమాకు పెట్టే శాటిలైట్ రైట్స్ ఖర్చుతో దాదాపుగా 4-5 చిన్న సినిమాలు తీసేయ్యవచ్చు అన్న స్థితిలో ఉన్నాం మనం. ఇదిలా ఉంటే బుల్లి తెరపై కూడా పోటీ భీకరంగా ఉండడంతో సినిమా రైట్స్ కొనడానికి కూడా చాలా కాంపిటేషన్ నెలకొంది. అందులో భాగంగానే మొన్న టాలీవుడ్ చరిత్రను చాటి చెప్పిన బాహుబలి చిత్రాన్ని భారీగా ఖర్చు పెట్టి మరీ ఒక ప్రముఖ ఛానెల్ సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్య టీవీలో ఈ చిత్రం ప్రదర్శించగా, 3 గంటల సినిమా కాస్త 5గంటలు వేశారంట. అంటే దాదాపుగా 2గంటల యాడ్స్ వచ్చాయి అంటే అర్ధం చేసుకోవచ్చు మన వ్యూయర్ షిప్ ఎలా ఉందో. ఇక మొన్న సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో డిక్టేటర్ – నాన్నకు ప్రేమతో – సోగ్గాడే చిన్ని నాయనా – ఎక్స్ప్రెస్ రాజా సినిమాల్లో మూడు సినిమాలను భారీ అమౌంట్ తో ఒక ఛానెల్ వాళ్ళు ఇట్టే కొనేశారు. ఇక మరొక ఛానెల్ వారు మౌనం వహిస్తూ కనీసం ఈ సినిమాలకు బిడ్ కూడా వెయ్యకుండా, చూసి, చూసి మహేష్ రాబోయే సినిమా ‘బ్రహ్మోత్సవం’ రైట్స్ ను భారీ అమౌంట్ తో దక్కిందుకున్నారని సమాచారం. అయితే ఇదే ఛానెలా వారు గతంలో మహేష్ శ్రీమంతుడు సినిమాను కూడా కొనడం విశేషం. వీళ్ళందరి సినిమాలను 4..5..6.. కోట్లు ఇచ్చి కొనేబదులు.. ఒక 20 కోట్లు పెట్టి ఏకంగా మహేష్ బాబు సినిమాను ఎందుకు కొన్నట్లు అంటే….మిగతావారి సినిమాలన్నీ వేసినా.. ఒక్క మహేష్ సినిమా ఒక్కటే వేసినా కూడా.. అంతే లాభం వస్తుందనేది వీరి నమ్మకం. అది మరి మహేష్ క్రేజ్. అంతా బాగానే ఉంది కానీ, మన ఈటీవీ రామోజీరావుగారిలాగా కాస్త చిన్న సినిమాలను కూడా పట్టించుకోండి సారు.