“క్రిష్”పెళ్ళికి వీళ్ళు ఎందుకు రాలేదు!

టాలీవుడ్ లో మంచి సందేశాత్మక చిత్రాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడి క్రిష్ పెళ్లి అత్యంత అంగరంగా వైభవంగా జరిగింది. అయితే ఎందరో అతిరధ మహారధులు వచ్చి దీవెనలు అందించిన ఈ వేడుకల ఎన్నో గుసగుసలు వినిపించాయి. అసలైతే ముందుగా ఈ పెళ్ళికి ఇక్కడే ఉన్నప్పటికీ, ఎన్టీఆర్, అల్లరి నరేశ్, శర్వానంద్, నాగార్జున హాజరు కాకపోవడం కాస్త ఆలోచనించే విషయమే అయినా….ఇక్కడ అంతకన్నా ఆలోచించే విషయం ఇంకొకటి నుండి అదేమిటి అంటే….ఈ పెళ్ళికి అనుష్క రాకపోవడం. వేదం సినిమాలో అనుష్క పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో మనం ప్రత్యేకంగా చెప్పుకొనవసరంలేదు. అయితే అదే క్రమంలో అంతటి పేరు తెచ్చిన పాత్ర ఇచ్చిన దర్శకుడి పెళ్ళికి అనుష్క రాకపోవడంపై పెళ్లి మండపంలోనే రకరకాల విమర్శలు వినిపించాయి…

వీరిద్దరి స్నేహానికి ఏమైంది అంటూ కొందరు చెవులు కొరుక్కుంటే, మరికొందరు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా కోసం హీరోయిన్ గా  అనుష్కను పెడదామని ఎంతో ప్రయత్నించినా ఆమె ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించి ప్రభాస్ సన్నిహితులు నిర్మిస్తున్న ‘భాగమతి’ కోసం డేట్స్ ఇవ్వడంతో షాక్ అయిన క్రిష్ ఈమెను వ్యక్తిగతంగా పిలవ లేదా అన్న అనుమానాలు రేకెత్తించారు. అయితే బాహుబలి-2 షూటింగ్ లో చేంజ్ ఓవర్ కోసం అనుష్క రాలేక పోయింది అని అందుకే వారందరి తరపునా రాజమౌళి వచ్చినట్లు కొందరి ఆలోచన. ఏది ఏమైనా….అలా మేలతాళాల మధ్య, గుసగూసల మధ్య సాగిపోయింది క్రిష్ పెళ్లి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus