నటిని చంపేసి.. గ్లామర్ వాడుకొంటున్నారు

90% సినిమా రివ్యూల్లో హీరోయిన్ల పనితనం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సదరు సినిమాలో కథానాయిక అందాల ప్రదర్శన గురించి, యద సౌష్టవం గురించి. తొడ సౌందర్యాల గురించి రాస్తుంటారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే హీరోయిన్ల నటన గురించి రాస్తుంటారు. అది రివ్యూ రైటర్ల తప్పు కాదు సదరు సినిమాలో హీరోయిన్ ని కథా గమనం కోసం కాక కేవలం గ్లామర్ కోసం వాడడమే కారణం. అయితే.. ఇలా గ్లామర్ షోకి మాత్రమే పరిమితమైపోతున్న హీరోయిన్లు కేవలం అందుకే పనికొస్తారనుకొంటున్నారు కొందరు. అలా అనుకొనేవారి అంచనాలను తారుమారు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు. మరి ఈ మధ్య కొత్తగా తెరకు పరిచయమవుతున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ అయిన సాయిపల్లవి, నివేదా థామస్ లాంటి వారిని చూసి మనసు చివుక్కుమందో తెలియదు కానీ.. ఉన్నట్లుండి తమలోని నటిని ప్రేక్షక లోకానికి పరిచయం చేసే పనిలో పడ్డారు. ఆ విధంగా తమ నటనతో ఆశ్చర్యపరిచిన అందగత్తెల గురించి చెప్పుకోవాలి.

1. త్రిష హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమై పదేళ్ళ పైనే అవుతుంది. తెలుగులో అందరు అగ్ర కథానాయకులతో మాత్రమే కాక యువ నాయకులతోనూ కలిసి నటించిన అనుభవం. తెలుగులో మాత్రమే కాక తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించింది త్రిష. అయితే.. పదేళ్ళలో ఎప్పుడూ ఆమె నటన గురించి మాట్లాడుకొని ఎరుగరు జనాలు. కానీ మొట్టమొదటిసారిగా మలయాళంలో రీసెంట్ గా నటించిన “హేయ్ జ్యూడ్” చిత్రంలో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకొంది. ఆ సినిమాలో సహజంగా నటించిన త్రిషను చూసి అందరూ షాక్ అయ్యారు. ఇన్నాళ్ళు ఈమెలోని ఇంత మంచి నటిని వినియోగించుకోకుండా స్విమ్మింగ్ ఫూల్స్ లో బికినీలు వేసి ఆడించి, హీరోల పక్కన బొమ్మలా నిల్చోబెట్టారా అని చిరాకుపడ్డవారు కూడా ఉన్నారు.

2. నయనతార పక్కా గ్లామర్ డాల్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అమ్మడు నయనతార. “గజిని” సినిమాలో నయనతారను చూసి ఇప్పుడు ఆమెను చూస్తే ఎవ్వరైనా సరే “ఈమె ఆమేనా?” అని తప్పకుండా అడుగుతారు. ఆ రేంజ్ లో నటిగానే కాక ఫిజికల్ గానూ ట్రాన్స్ ఫార్మ్ అయ్యింది నయనతార. నాలుగైదేళ్ళ ముందు ఆమె కేవలం అందాల ఆరబోతకు మాత్రమే ఉపయోగపడేది. అయితే.. ‘శ్రీరామరాజ్యం”తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన నయనతార ఆ తర్వాత “కృష్ణం వందే జగద్గురుం”తో తన స్టామినాను ప్రూవ్ చేసుకొంది. ఇక రీసెంట్ గా వచ్చిన “కర్తవ్యం” సినిమాలో నయనతార నటన చూసినవాళ్ళందరూ “ఇది నయనతార నట విశ్వరూపం” అని పేర్కొనడం విశేషం.

3. రాశీఖన్నా తొలి చిత్రమైన “ఊహలు గుసగుసలాడే”లో పెర్ఫార్మెన్స్ తోపాటు అందంతోనూ అదరగొట్టిన రాశీ ఆ తర్వాత మాత్రం కేవలం గ్లామర్ రోల్స్ కి పరిమితమైపోయింది. ఒక్కో సినిమాలో గ్లామర్ డోస్ పెంచిందే తప్ప పెర్ఫారెన్స్ మాత్రం చేయలేదు. కాదు కాదు చేయనివ్వలేదు. ఇటీవల “టచ్ చేసి చూడు” సినిమాలో అంగాంగ ప్రదర్శన చేసి కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిన రాశీ.. “తొలిప్రేమ” చిత్రంలో అసలు ఎలాంటి ఎక్స్ పోజింగ్ అనేది లేకుండా కేవలం నటనతో అలరించి.. హీరోగా నటించిన వరుణ్ తేజ్ కూడా డామినేట్ చేసింది.

4. అనుష్క “సూపర్”తో కథానాయికగా పరిచయమైన అనుష్కకు నటన వచ్చు అనే విషయం “అరుంధతి” చూసేవరకూ ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత “రుద్రమదేవి, బాహుబలి, భాగమతి” చిత్రాల్లో నటిగా తన విశ్వరూపం ప్రదర్శించింది అనుష్క. అయితే.. వరుసబెట్టి అలాంటి సినిమాల్లో నటించి బోర్ కొట్టేసి.. ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలనుందని స్వయంగా అనుష్క పలు ఇంటర్వ్యూస్ లో పేర్కొనడం విశేషం.

5. సమంత తెలుగులో తొలి చిత్రమైన “ఏం మాయ చేసావే” చిత్రంతో నటిగా విశేషమైన గుర్తింపు సంపాదించుకొన్న సమంతకు ఆ సినిమా తర్వాత అన్నీ గ్లామర్ రోల్సే వచ్చాయి. కానీ… మళ్ళీ “ఈగ” సినిమాతో తన నట ప్రతిభను ఘనంగా చాటుకొంది. ఆ సినిమాలో అభినయ చక్రవర్తి సుదీప్ తో సమానంగా ఎమోషన్ ను పండించి శభాష్ అనిపించుకొంది. అయితే.. ఆ తర్వాత కూడా గ్లామర్ రోల్స్ తోపాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కూడా చేసుకొంటూ ముందుకెళ్లడం గమనార్హం.

6. ఛార్మీ పక్కా గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకొన్న పంజాబీ భామ ఛార్మీని చాన్నాళ్లపాటు కేవలం గ్లామర్ రోల్స్ కు పరిమితం చేశారు. ఒక్కోసారి మితిమీరిన ఎక్స్ పోజింగ్ చేసి వార్తల్లో కూడా నిలిచింది. అయితే.. “అనుకోకుండా ఒకరోజు” అనే సినిమాలో ఛార్మీ మేకప్ లేకుండా సహజంగా నటించిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఛార్మీ ఎక్స్ పోజింగ్ చేయడం మాత్రమే కాదు అద్భుతంగా నటించగలదు అనే విషయం అప్పుడే జనాలకి అర్ధమైంది.

7. శ్రియ శరణ్ “ఇష్టం” సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన శ్రియ కెరీర్ కొత్తలో మంచి పాత్రలు చేసినప్పటికీ తర్వాత పోటీ తట్టుకోలేక గ్లామర్ డోస్ పెంచింది. ఇక శ్రియ కెరీర్ అయిపోయింది అని ఆందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో “మనం” సినిమాలో రామలక్షిగా అభినయంతో ఆకట్టుకొంది. మరి ఇప్పుడు పెళ్లైపోయింది కాబట్టి ఇకపై సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలి.

8. రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ తొలినాళ్ళ నుంచే నటన కంటే గ్లామర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ వరుస అవకాశాలు రావడంతో నటనను పూర్తిగా పక్కనెట్టేసి ఏదో సినిమాల్లో అలా నటిస్తూ, హీరోల పక్కన డ్యాన్సులు చేస్తూ వెళ్లిపోయింది. కానీ.. “జయ జానకి నాయక” చిత్రంలో మాత్రం నటిగా తనను తాను ప్రూవ్ చేసుకొంది. ఈ సినిమాలో ఫస్టాఫ్ మొత్తం హుందాగల యువతిగా, సెకండాఫ్ మొత్తం ఎమోషన్ ఉమెన్ గా అద్భుతమైన నటన కనబరిచింది.

9. కాజల్ అగర్వాల్ ఒక్క “చందమామ, మగధీర” తప్పితే ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా కనీస స్థాయిలో కూడా నటన ప్రదర్శించక ఇక ఈ అమ్మాయి నుంచి నటన ఎక్స్ పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అని కాజల్ అభిమానులు తప్ప అందరూ ఫిక్స్ అయిపోయిన తరుణంలో.. హిందీలో వచ్చిన “దో లఫ్జోంకి కహానీ” సినిమాలో అంధురాలిగా నేర్పుతో నటించిన కాజల్ ను చూసి ఖంగుతిన్నారు. అలాగే.. “నేనే రాజు నేనే మంత్రి”లోనూ రాధగా అద్భుతమైన నటనతో అలరించింది కాజల్.

10. తమన్నా తమన్నా అసలు కెరీర్ స్టార్ట్ చేసిందే గ్లామర్ డాల్ గా. డైరెక్టర్లు, హీరోలు తమన్నా నడుము మీద పెట్టిన ధ్యాస ఆమె నటన మీద ఎప్పుడు పెట్టలేదు. వాళ్ళకే లేనప్పుడు నాకెందుకు అనుకొందో ఏమో కానీ తమన్నా కూడా ఎప్పుడూ తన నటనను ప్రూవ్ చేసుకోవాలనుకోలేదు. అయితే.. సురేందర్ రెడ్డి మాత్రం “ఊసరవెల్లి” సినిమాలో తమన్నా అందంతోపాటు ఆమె అభినయ సామర్ధ్యాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో బురదలో ఎన్టీయార్ కాళ్ళు పట్టుకుని ఏడ్చే సన్నివేశంలో తమన్నాను చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus