Balakrishna: బాలకృష్ణ తెలిసే చేస్తున్నాడా.. లేకుండా అనుకోకుండా జరుగుతున్నాయా?

నందమూరి బాలకృష్ణ భోళా శంకరుడు.. మనసులో ఏం దాచుకోడు అంతా బయటకు అనేస్తాడు. బాలయ్యది చిన్నపిల్లాడి తత్వం.. పెద్దగా మనసులో కల్మశం లేకుండా మాట్లాడేస్తాడు అని చెబుతుంటారు. అయితే బాలకృష్ణ మాటల్లో మనసు చివుక్కు మనేవి కూడా ఉంటాయి. ఇన్నాళ్లూ ఏదో పొరపాటున అనేశారులే.. అని కొందరు వదిలేసినా.. తాజాగా అక్కినేని గురించి ఆయన అన్న మాటలు కుంపటి రాజేశాయి. ‘అక్కినేని తొక్కినేని’ అంటూ బాలయ్య ఇటీవల అన్నారు. ‘వీర సింహా రెడ్డి’ విజయోత్సవంలో ఈ మాటలు ఆయన నోట వచ్చాయి.

బాలయ్య మాటలు ఏం పట్టించుకుంటారు, ఆయనేదో పొరపాటున అనేశారు అని కొంతమంది ఆయన అభిమానులు, వ్యక్తులు అనడం మీరు కూడా వినే ఉంటారు. అంతెందుకు ఆయన కూడా ఏదో ఫ్లోలో వచ్చాయి అని కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే దాంతోపాటు మరోసారి మనసు చివుక్కుమనేలా మాట్లాడారు. ‘అటువైపు ఆ ఎఫెక్షన్‌ లేదు.. మావైపు ఉంది’ అంటూ మళ్లీ అక్కినేని కుటుంబాన్ని తక్కువ చేస్తూ మాట్లాడారు. ఇదంతా చూస్తున్న జనాలు, నెటిజన్లు… బాలయ్య పొరపాటున అన్నా, ఫ్లోలో అన్నా.. తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు అని అంటున్నారు.

సినిమాల పరంగా, మాస్ ఇమేజ్‌ పరంగా బాలయ్యను ఎవరూ తక్కువ చేయలేరు. ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారాయన. మధ్యలో దారుణమైన పరాజయాలొచ్చినప్పుడల్లా గతంలో బి.గోపాల్‌ ఆ తర్వాత బోయపాటి శ్రీను ఆయనను ఒడ్డున పడేస్తున్నారు. విజయాలు లేని సమయంలో వాళ్లిచ్చిన బ్లాక్‌బస్టర్‌లే బాలయ్య కెరీర్‌లో పీక్స్‌ను టచ్‌ చేసేలా చేశాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కెరీర్‌ పీక్స్‌లో ఉంది అనుకున్నప్పుడల్లా బాలయ్య ఇలా మాటలు అని ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాలి.

సినిమాల్లో బాలయ్య సంగతి పక్కనపెడితే.. నిజ జీవితంలో ఆయన చేసే కామెంట్లు, అభిమానుల్ని కొట్టడాలు ఏమన్నా అంటే తనకు అభిమానుల మీద ఉన్న ప్రేమ అది చెప్పడాలు వినడానికి బాగుంటున్నాయి. కానీ ఆఖరిగా చూస్తే.. ఎందుకో అవసరం లేని మాటల రొచ్చులోకి బాలయ్య పడుతున్నాడు అనే ఫీలింగ్‌ అయితే కలగక మానదు అంటున్నారు నెటిజన్లు. కాబట్టి విషయాన్ని జఠిలం చేసుకోకుండా బాలయ్య ‘అక్కినేని’పై కామెంట్ల విషయాన్ని తేల్చుకుంటే మంచిది అనేది కొంతమంది నెటిజన్ల కోరిక.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus