టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ చిత్రానికి మొదటి షో నుండే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. కొంతమంది సినిమా బాగుంది అంటున్నారు. మరికొంతమంది బాలేదు అంటున్నారు. అయితే బాగుంది అన్నవాళ్ళు కానీ, బాలేదు అన్నవాళ్ళు కానీ చెప్పే.. కామన్ పాయింట్ ఒకటి ఉంది.అదే.. ‘మహేష్ బాబు నటన ఇరక్కొట్టేసాడు’ అని..! ‘పోకిరి’ ‘ఖలేజా’ ‘దూకుడు’ లో మహేష్ ను అందరికీ మరోసారి చూపించాడు అని..!
అతని స్క్రీన్ అప్పీరెన్స్ కూడా బాగుంది అని కూడా అంతా చెబుతున్నారు. అయితే సినిమా బాగోలేదు అన్నవాళ్ళు మాత్రం దర్శకుడు పరశురామ్ నే నిందిస్తున్నారు. ఓ పెద్ద స్టార్ హీరోని మొదటిసారిగా హ్యాండిల్ చేస్తున్న పరశురామ్.. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించ లేకపోయాడు అని వారు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు..! అయితే ‘సర్కారు వారి పాట’ లో కొన్ని మైనస్ లు ఉన్న మాట వాస్తవమే. అయితే మహేష్ బాబు ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అన్నా, సినిమాలో వన్ మ్యాన్ షో చేశాడు అన్నా దర్శకుడు పరశురామ్ కు కూడా క్రెడిట్ వెళ్తుంది.
అతని స్క్రిప్ట్ ను బలంగా నమ్మిన మహేష్ ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వగలిగాడు. మహేష్ బాబు చాలా ప్లాప్ సినిమాల్లో కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ‘ఖలేజా’ ‘1 నేనొక్కడినే’ వంటి సినిమాలు ఎందుకు ప్లాప్ అయినట్టు. మహేష్ ఎంత బాగా చేసినా దానిని జనాలు రిసీవ్ చేసుకోగలగాలి.
జనాలు రిసీవ్ చేసుకున్నారు అంటే అది నూటికి నూరు శాతం డైరెక్టర్ క్రెడిట్ అనే చెప్పాలి. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమాలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి.. ఆ మూవీ విషయంలో కూడా రాజమౌళి తడబడ్డాడు. రాజమౌళినే తడబడినప్పుడు, పరశురామ్ వంటి దర్శకుడిని నిందిస్తే ఎలా..!
Most Recommended Video
10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!