Balakrishna: ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ పేరెందుకు మార్చారో?

బాలకృష్ణ – సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన మరపురాని చిత్రం ‘ఆదిత్య 369’. రెగ్యులర్‌ సినిమాలకు దూరంగా వచ్చిన సినిమాను తెలుగు ప్రేక్షకులు దగ్గర చేసుకున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని కొద్ది రోజులకే ప్రకటించారు బాలయ్య. అయితే ఆ తర్వాత పెద్దగా ఆ చర్చ కనిపించలేదు. ఆ తర్వాత మరోసారి ఆ చర్చ వచ్చింది. ఈ సారి సినిమాకు ‘ఆదిత్య 963’ అనే పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. ఒకటి రెండు సందర్భాల్లో బాలయ్య నోట కూడా ఇలాంటి మాటే వినిపించింది. అయితే ఇప్పుడు పేరు మారిపోయింది.

‘ఆదిత్య 369’… నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మరపురాని సినిమా. అంతేకాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ మైలురాయి… గీటురాయి కూడా. అప్పటివరకు అలాంటి కాన్సెప్ట్‌ సినిమాను చూడని తెలుగు ప్రేక్షకులు ‘మనం తెలుగు సినిమానే చూస్తున్నామా’ అని ఒకసారి గిల్లి చూసుకున్నారట. ఈ పాన్‌ ఇండియా సీజన్‌లో ఆ సినిమా వచ్చి ఉంటే రికార్డుల మోత మోగేది. అలాంటి సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. అదీ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా.

ఈ సినిమాకు బాలయ్యే దర్శకత్వం వహిస్తారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు కూడా. అయితే ఇటీవల సినిమా పేరును కూడా చెప్పారు. ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ అనే పేరు ఫిక్స్‌ చేసినట్లు ఇటీవల బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇది చూస్తుంటే ఏదో మొబైల్స్‌కి అడ్వాన్స్‌డ్‌ మోడల్‌ పేరులాగా ఉంది. ట్రెండీనెస్‌ కోసం అలా పెట్టారు అనుకుందాం. 999 అంటే లక్కీ నెంబరు అనుకుందాం. కానీ ఏదో అన్‌ఈజీగా అనిపించడం లేదూ!

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus