తెలుగు డైరెక్టర్లను పక్కన పెట్టేస్తున్న యాక్షన్ హీరో

ఇప్పుడంటే నాని ,విజయ్ దేవరకొండ, సాయి తేజ్, వంటి కుర్ర హీరోలు ఎక్కువైపోయారు కాబట్టి చప్పుడు లేకుండా పడి ఉన్నాడు కానీ అప్పట్లో వరుస యాక్షన్ సినిమాలతో మాస్ ఆడియన్స్ ను అలరించేవాడు గోపీచంద్. ప్రస్తుతం మాస్ సినిమాలకి, కామెడీ సినిమాలకి కాలం చెల్లిపోయింది కాబట్టి ఈ హీరోని ఎవరూ పట్టించుకోవట్లేదు. వరుస ప్లాపులతో డీలా పడిపోయాడు. అలా అని మనోడు కొత్త కథల్ని ఎంచుకోలేడా అంటే… ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’, ‘ఒంటరి’ వంటి సినిమాలతో ఎప్పుడో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాడు.

అందులో ‘ఒక్కడున్నాడు’ ‘సాహసం’ వంటి సినిమాలు వచ్చిన టైమింగ్ బ్యాడ్ అని చెప్పొచ్చు కానీ ‘ఒంటరి’ సినిమా మాత్రం అట్టర్ ప్లాపయ్యింది. ఈమధ్య గోపిచంద్ కు ఎందుకో తెలుగు డైరెక్టర్ల పై అంత నమ్మకం లేనట్టుంది… వరుసగా తమిళ డైరెక్టర్లకే ఓకే చెబుతున్నాడు. ఇప్పటీకే తమిళ డైరెక్టర్ జ్యోతికృష్ణ తో ‘ఆక్సిజన్’ చేసాడు. ఇప్పుడు మరో కోలీవుడ్ డైరెక్టర్ తిరు డైరెక్షన్లో ‘చాణక్య’ అనే సినిమా చేశాడు. అది దశరాకి విడుదల కాబోతుంది. అది అలా అయ్యిందో లేదో ఇప్పుడు బిను సుబ్రహ్మణ్యం అనే కోలీవుడ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటి వరకూ గోపీచంద్ కోసం ‘రచ్చ ‘ ఫేమ్ సంపత్ నంది, అలాగే గోపీచంద్ కు ‘లక్ష్యం’ ‘లౌక్యం’ వంటి హిట్స్ ఇచ్చిన శ్రీవాస్… వెయిట్ చేశారట. వారి ఆశల పై గోపీచంద్ నీళ్ళు జల్లేసినట్టయ్యింది.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus