‘యంగ్ టైగర్’ ఎందుకు మౌనం గా ఉన్నాడు!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటు మెగా ఫ్యామిలీలో కూడా విభేధాలు ఉన్నప్పటికీ వారు అభిమానుల సమక్షంలో ప్రవర్తిస్తున్న తీరు చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే…నిన్న జరిగిన బాలయ్య 100వ చిత్రం వేడుకల్లో అతిరధమహారధులు ఎందరో విచ్చేసి బాలయ్యను అభినందించారు. కానీ ఎందరొచ్చినా, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్  లేని లోటు ఖచ్చితంగా కనిపించింది.

ఇదిలా ఉంటే వారిరువురి మధ్య ఉన్న కోల్డ్ వార్ అంతా మీడియా సృష్టి అని ‘నాన్నకు ప్రేమతో’ విడుదల సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్టీఆర్ తెలిపాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏ అగాధం లేనప్పుడు ఎన్టీఆర్ కు బాబాయి అంటే ప్రాణం అయినప్పుడు ఎందుకు ఆయన కనీసం బాబాయిని అభినందిస్తూ ట్వీట్ చెయ్యలేదు అని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత ప్రత్యేక అభిమానులు ఉన్నా ముందు ఆయన నందమూరి వంసానికి వారసుడు అన్న చిన్న లాజిక్ ను ఎలా మరచిపోతారు అని చాలామంది నందమూరి వీరాభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో తన బాబాయ్ సినిమా ప్రారంభోత్సవం రోజున మౌనంగా ఉన్న జూనియర్ రాబోతున్న తన తాత నందమూరి తారక రామారావు పుట్టినరోజునాడు మాత్రం తన ‘జనతాగ్యారేజ్’ ట్రైలర్ ను విడుదల చేస్తూ తాను నందమూరి కుటుంబ వారసుడునే అని మరోసారి వ్యూహాత్మకంగా తెలియజెప్పేందుకు ఆలోచనలు చేస్తున్నాలు సమాచారం. ఏది ఏమైనా అందరూ కలసి ఉంటేనే ఇండస్ట్రీకి మంచిది అని విశ్లేషకుల భావన.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags