కాజల్ పెళ్లి వేడుకల ఫోటోలలో.. ఈ మార్పుని ఎంతమంది గమనించుంటారో..!

తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్… అక్టోబర్ 30న(ఈరోజు) పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్మెన్ గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ పెళ్లి కొద్దిపాటి బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరగబోతోంది. ఇప్పటికే నిశ్చితార్ధం వేడుక ముగిసింది. ఇక మెహందీ వేడుక నిన్న సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్.. నిన్న(గురువారం నాడు) తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కాజల్ అగర్వాల్ కు విషెస్ చెబుతూ ఆమె అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ ఫోటోలను చూసిన మరికొంత మంది నెటిజన్లు.. వీళ్ళని యాంటీ ఫ్యాన్స్ అని కూడా అనలేము కానీ.. కొన్ని సందేహాలకు తెర లేపారు. విషయం ఏమిటంటే.. పెళ్లి కోసం కాజల్ ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ వంటిది చేయించుకుందా అనేది వారి సందేహం..? ఎందుకంటే..వారి దృష్టిలో కాజల్ లేటెస్ట్ ఫోటోలను పరిశీలిస్తే ఆమె చీక్స్ మరియు లిప్స్ డిఫరెంట్ గా ఉన్నాయట. అందుకే పెళ్లిలో అందంగా కనిపించాలి అనే ఉద్దేశంతో కాజల్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఉండొచ్చని వారు చెప్పుకొస్తున్నారు.

ఇది నిజమో.. కాదో తెలీదు. ఒకవేళ నిజమైనా కూడా తప్పులేదు.ఎందుకంటే పెళ్లిలో ఎవరైనా అందంగా కనిపించాలి అని అనుకుంటారు కదా.! అయితే నిజంగా కాజల్ సర్జరీ చేయించుకుందా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

1

2

3

4

5

6

7

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus