Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

‘బాహుబలి’ సినిమాల్లో చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. అందులో బాగా ముఖ్యమైన వాటిలో కట్టప్ప ఒకటి. సత్య రాజ్‌ పోషించిన ఆ పాత్ర సినిమాలో చాలా చాలా కీలకం. ఆ పాత్రకు ఓ ఇంట్రెస్టింగ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉందని సినిమాలో చెప్పారు. ఇప్పుడు అదే ఫ్లాష్‌ బ్యాక్‌తో ఓ సినిమా చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. నిజానికి ఓ వారం రోజులుగా ఈ విషయంలో టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పుడు ఇలాంటి రిస్క్‌ అవసరమా అనే మాట కూడా వినిపిస్తోంది.

Sathyaraj

‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా రీరిలీజ్ కోసం ప్రస్తుతం రాజమౌళి అండ్‌ కో. బిజీ బిజీగా ఉంది. జక్కన డైరెక్ట్‌గా ఈ పనుల్లో లేకపోయినా తన టీమ్‌తో చేయిస్తున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాలను ఒకటి చేసి అక్టోబరు ఎండింగ్‌లో ‘బాహుబలి: ది ఎపిక్‌’ అని రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ సమయంలోనే ‘కట్టప్ప’ హీరోగా సినిమా అనే మాట బయటకు వచ్చింది. ఆ సినిమా హైప్‌ను ఈ సినిమా కోసం వాడుదాం అనుకుంటున్నారా? లేక ‘బాహుబలి’ హైప్‌తో ‘కట్టప్ప’ను ప్రమోట్‌ చేసుకుందాం అనుకుంటున్నారా తెలియదు కానీ.. రెండూ ఒకే సమయంలో బయటికొచ్చాయి.

‘కట్టప్ప’ పాత్ర బ్యాక్ స్టోరీని ఒక సినిమాగా రాసే ప్లాన్‌లో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టప్ప ఎందుకు బానిసగా మారాడు, విధేయత చూపడం వెనుక కారణమేంటి లాంటి అంశాలను ఈ సినిమాలో చూపించే ఆలోచనలో విజయేంద్రప్రసాద్‌ ఉన్నారని చెబుతున్నారు. ఇందులో హీరోయిన్‌, పాటలు, కామెడీ లాంటివి ఉండవు కాబట్టి.. ఈ సినిమా పెద్ద గ్యాంబెల్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి సత్య రాజ్‌ను సోలో హీరోగా చూసేవారు ఉంటారా అనేదే ప్రశ్న.

అయితే, ఈ సినిమా ఫీచర్ ఫిల్మ్‌ కాదని.. యానిమేషన్‌ సిరీస్‌గా చిత్రీకరించాలని చూస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే గతంలో ‘బాహుబలి’ ముందు కథ అంటూ ఓ ప్రయత్నం చేసి ఇబ్బందికర ఫలితం అందుకున్నారు. మరిప్పుడు ‘కట్టప్ప’ కోసం ఆ రిస్క్‌ చేస్తారా?

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus