Ravi Teja: ‘ఖిలాడీ’ టీజర్‌లో పంచ్‌ డైలాగ్ విన్నారా?

i Tejaఉగాది గిఫ్ట్‌ అంటూ ఈ రోజు ఉదయం రవితేజ ‘ఖిలాడీ’ టీజర్‌ను విడుదల చేశాడు. రవితేజ ఓవైపు క్లాస్ లుక్‌, మరోవైపు మాస్ టచ్‌, రొమాంటిక్‌ సీన్స్‌తో వావ్‌ అనిపించింది టీజర్‌. ఇక్కడ టీజర్‌ ఎలా ఉంది అనేది పక్కన పెడితే… టీజర్‌ ఆఖరులో వచ్చిన డైలాగే పంటి కింది రాయిలా మారిందంటే నమ్ముతారా. కావాలంటే మీరూ ఓసారి టీజర్‌ చూడండి, ఇప్పటికే చూసుంటే మరోసారి ఓ లుక్కేయండి. అంతా బాగుంది అనుకుంటుండగా… ఆఖరున ఓ డైలాగ్‌ ఇబ్బందిగా ఉంటుంది.

ఏంటి టీజర్‌ చూశారా… మేం చెప్పినట్లు టీజర్‌ సూపర్‌ ఉంది కదా. మరి ఆఖరి డైలాగ్‌ ఎలా ఉంది చెప్పండి. రవితేజ తనదైన స్టయిల్‌లో ఇంగ్లిష్‌లో చెప్పాడు కదా డైలాగ్‌. తెలుగు సినిమాలో ఇంగ్లిష్‌ డైలాగ్‌లు ఉండటం చాలాసార్లు చూశాం. అయితే డైలాగ్‌లో ఒకటి రెండు పదాలు ఇంగ్లిష్‌లో ఉంటాయి, దీంతో అదేదో ఇంగ్లిష్ డైలాగ్‌లా అనిపించదు. అయితే ఈ టీజర్‌లో చూస్తే… అదే హాలీవుడ్‌ మూవీ అనుకున్నట్లు పూర్తి ఇంగ్లిష్‌ డైలాగ్‌ పెట్టాడు దర్శకుడు.

హాలీవుడ్‌ నుండి సీన్స్‌, క్యారెక్టర్స్‌, థీమ్‌ తీసుకోవడం తప్పేం కాదు. అయితే అక్కడిలా మొత్తం ఇంగ్లిష్‌లో డైలాగ్ చెప్పిస్తే ఎలా… పోనీ అదేమన్నా అబ్రాడ్‌లో తీసిన సీనా అంటే కాదు కూడా. ఇక్కడో ఇంకో విషయం కూడా గమనించాలి. తెలుగు పండగ సందర్భంగా టీజర్‌ విడుదల చేసి ఈ ఇంగ్లిష్‌ గోల ఏంటో? ‘పనికిరాని భావోద్వేగాలు లేకుండా నువ్వు తెలివిగా ఆడితే… నిన్నెవరూ ఆపలేరు’ ఎంత బాగుందో కదా డైలాగ్‌. దీనినే రవితేజతో చెప్పిస్తే సరిపోయేదానికి ఇంగ్లిష్ డైలాగ్‌ ఎందుకో?


‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus