Bigg Boss 5 Telugu: కెప్టెన్సీ టాస్క్‌లో బిగ్‌బాస్‌ ఏం చేయబోతున్నట్లు!

హౌస్‌లో ఎవరినైనా పైకి లేపాలంటే జాకీలు పట్టుకొని సిద్ధంగా ఉంటాడు బిగ్‌బాస్‌. మొన్నీ మధ్యే జశ్వంత్‌ విషయంలో ఈ మాట చెప్పుకున్నాం గుర్తుందా? ఇప్పుడు మరో మనిషి విషయంలో అదే పని చేస్తున్నాడు బిగ్‌బాస్‌. జెస్సీ విషయంలో సీక్రెట్‌ టాస్క్‌ జాకీ అయితే… ఈసారి జాకీగా లోబోను వాడుకున్నారు. అలా పైకి లేపాలనుకుంటున్న మనిషి కాజల్‌. ఈ వారం పర్‌ఫార్మెన్స్‌ పరంగా పెద్దగా స్కోపు దొరకని కాజల్‌కు బిగ్‌బాస్‌ ఏకంగా కెప్టెన్సీ కంటెండర్‌ అవకాశం కట్టబెట్టాడు.

సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న లోబోను ఇంట్లోకి వెళ్లొచ్చు అని చెప్పి… చేతిలో రెండు గుడ్లు పెట్టాడు బిగ్‌బాస్‌. ఒకటి బ్లాక్‌ అయితే, రెండోది గోల్డ్‌. బ్లాక్‌ ఎగ్‌ ఇస్తే… అప్పటికే కెప్టెన్సీ పోటీదారు కంటెండర్‌ అయిన వాళ్లు తప్పుకోవాలి. దీనిని లోబో… శ్రీరామ్‌కి ఇచ్చాడు. ఆయన కూడా ఆనందంగా తీసుకున్నాడు. ఇక గోల్డెన్‌ ఎగ్‌ విషయంలో లోబో చిన్న కామెడీ చేసి… ఆఖరికి కాజల్‌కి ఇచ్చాడు. ఇక్కడే బిగ్‌బాస్‌ స్ట్రాటజీ కనిపిస్తోంది.

నిజానికి ప్రభావతి గుడ్ల టాస్క్‌లో కాజల్‌ ప్రదర్శన అంతంతమాత్రమే అని చెప్పాలి. ఏదో ఒకటి రెండుసార్లు స్క్రీన్‌ మీద కనిపించింది. ఆ తర్వాత ఏడుపులే కనిపించాయి. ప్రియ ఆమెను టార్గెట్‌ చేస్తున్నట్లు చూపించి కాస్త ఫుటేజ్‌ రాబట్టారు. ఇంకాస్త పుషింగ్‌ అవసరమని ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్‌గా చేశాడు బిగ్‌బాస్‌. మరి అందరినీ దాటుకొని ఈ వారం కాజల్‌ను కెప్టెన్‌ అవుతుందా? (చేస్తారా) అనేది చూడాలి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus