ఫోటో వెనుక అసలు కథ.. అదేనా?

ఎంతోకాలంగా సరైన హిట్టులేక కిందా మీదా పడుతున్నాడు రామ్. తన తోటి హీరోలు నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్ వంటి వారు ఎప్పుడో 30 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. కానీ రామ్ మాత్రం ఇప్పటివరకూ ఆ క్లబ్ లో చేరలేకపోయాడు. ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఆ ఫీట్ ను సాధించాడు. పూరి కూడా ‘టెంపర్’ తర్వాత.. సుమారు నాలుగేళ్ళు తరువాత హిట్టందుకున్నాడు పూరి. ఎట్టకేలకు ఇద్దరూ మంచి మాస్ హిట్టందుకున్నారు. ఇది పక్కన పెడితే… తాజాగా రామ్… మహేష్ ను కలవడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

ఇటీవల పూరి ఓ ఇంటర్వ్యూలో మహేష్ పై చేసిన వ్యాఖ్యల కారణంగా పూరీని.. ఓ రేంజ్లో వాడేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ విషయాన్ని పూరి కూడా ఒప్పుకున్నాడు ‘నన్ను ట్రోల్ చేస్తున్నారని’..! అయితే ఈ మధ్యే విదేశాలనుండీ వచ్చి సక్సెస్ సెలబ్రేషన్స్ లో జాయిన్ అయ్యాను రామ్.. ప్రమోషన్లు కూడా బాగానే చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ తో కలిసి రామ్ దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ ఫోటోకి ‘ఇస్మార్ట్ శంకర్ తో ఎన్కౌంటర్ శంకర్’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. అంతేకాదు ఈ ఫోటో పై రకరకాల కామెంట్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే పూరి పై వస్తున్న ట్రోల్స్ విషయం పై ‘రామ్ … మహేష్ ను కలిసి ఆయన ఫ్యాన్స్ ని కూల్ చేయమని చెప్పుంటాడు’ అని ఫిలింనగర్లో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus