మహేష్ బాబు కెరీర్లో కొన్ని సినిమాలు ఎందుకు డిజాస్టర్లు అయ్యాయో అర్ధం కాదు అని చాలా మంది చెబుతుంటారు. అందులో ‘ఖలేజా’ ‘ 1 నేనొక్కడినే’ సినిమాలు ప్రప్రదమంగా కనిపిస్తాయి. ‘ఖలేజా’ చిత్రం డిజాస్టర్ అవ్వడంతో మహేష్, త్రివిక్రమ్ మళ్ళీ కలిసి సినిమా చెయ్యలేదు. ఆ తరువాత మహేష్ కొన్ని ప్రయోగాలు చేసినా త్రివిక్రమ్ మాత్రం పూర్తిగా రొటీన్ టెంప్లేట్ సినిమాలు తీస్తూ సేఫ్ గేమ్ ఆడిస్తున్నాడు. ‘ఖలేజా’ సినిమా కచ్చితంగా రాంగ్ టైములో వచ్చింది కాబట్టే ఆడలేదు అని కొందరు అంటుంటే,
మరికొందరు…. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అందుకే ఆడలేదు అని అంటుంటారు. ఈ చిత్రం ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలీదు అని గతంలో విజయ్ దేవరకొండ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మరో కమెడియన్, రైటర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన హర్ష వర్దన్ కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడుతూ…”త్రివిక్రమ్ గారు పంచ్ డైలాగ్స్ లేకుండా రాసిన ‘ఖలేజా’ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఆ చిత్రం ఆడకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.
ఆ సినిమాలో మహేష్ బాబు నటన చాలా గొప్పగా ఉంటుంది.అందులోని డైలాగ్స్ అన్నీ మహేష్ గారి పాత్ర నుండీ పుట్టుకొచ్చినవే. ఆ చిత్రంలో చిన్న చిన్న డైలాగ్స్ తో సీన్స్ ను పండించిన తీరును మెచ్చుకోకుండా ఉండలేం. పాత్రల స్వభావం నుంచి డైలాగ్స్ రావడం వల్లనే అవి అంతగా పేలాయి. ఎక్కువగా ఆ చిత్రం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు హర్షవర్దన్.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!