Manchu Vishnu: మంచు విష్ణుకు ఆ నిరసనలు కనిపించలేదా..!

Advertisement

‘గాలి నాగేశ్వరరావు’ పేరుతో ఓ సినిమా రూపొందిస్తున్నాం అంటూ ఆ మధ్య మంచు విష్ణు ఓ సినిమా ప్రకటించారు. ఆ వెంటనే రకరకాల ఫొటోలు, వీడియోలతో ప్రచారం కూడా చేశారు. అయితే సినిమా పేరు అదే అని ఎక్కడా అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే కొన్ని రోజుల క్రితం తమ సినిమా పేరు ‘జిన్నా’ అంటూ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. పేరు క్యాచీగా ఉన్నా.. దాని వెనుక చాలా సమస్యలున్నాయి. వాటి గురించి టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ కాగానే చిన్నపాటి నిరసనలు కూడా వచ్చాయి.

ఆ సినిమా పేరు గతంలో అనౌన్స్‌ చేసిన విధానం కొంతమందికి నచ్చలేదు. కారణం.. ఆ సినిమా పేరును తిరుమల కొండల వెనుక నుండి గాల్లోకి వచ్చినట్లు చూపించారు. దాంతోపాటు ఆ పేరు కూడా వద్దు అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు వద్దు అని చెప్పారు. కారణం జిన్నా వల్ల మన దేశం గతంలో చాలా ఇబ్బందులు పడింది అంటూ నాటి విషయాలను ప్రస్తావించారు. ఆ పేరు మార్చాల్సిందే అంటూ నినదించారు.

అయితే అప్పుడు ఈ సినిమా విషయంలో మంచు విష్ణు నుండి కానీ, దర్శకనిర్మాతల నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఏ మాటలు లేకుండా సినిమా పేరు మార్చేస్తారేమో అని అనుకున్నార. అయితే సినిమా పేరు విషయంలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పకనే చెబుతూ సినిమా ఫస్ట్‌ లుక్‌ గురించి టీమ్‌ అనౌన్స్‌ చేసింది. అందులో కూడా సినిమా పేరును ‘జిన్నా’గానే చూపించింది. దేశంలో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య పరిస్థితులు అంతగా బాగోలేవు.

ఈ సమయంలో మళ్లీ ‘జిన్నా’ పేరుతో సినిమా వస్తే ఇబ్బంది పడ్డట్లే అని చెబుతున్నారు. అయితే అసలు జిన్నాకి, ఈ సినిమా జిన్నాకి ఎలాంటి సంబంధం లేదు. కానీ పేరుతోనే సమస్య వచ్చేలా ఉంది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… విష్ణు మంచు ‘గాలి నాగేశ్వరరావు’ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకుడు. స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్‌, రేణుకగా సన్నీ లియోన్ నటిస్తున్నారు. అన్నట్లు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ 11 వతేదీన విడుదలవుతోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news