మెగా బ్రదర్ నాగబాబు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటారు. తమ ఫ్యామిలీ పై ఎవరైనా నోరు పారేసుకుంటే తనదైన శైలిలో కౌంటర్ లు వేసే వీడియోలను చేసి పోస్ట్ చేస్తుంటారు. బుల్లితెర పై ఫుల్ టైం వర్క్ చేసి సంపాదిస్తూనే.. ఇలా సోషల్ మీడియాలో పార్ట్ టైం చేసి కూడా సంపాదించుకుంటూ ఉంటారు నాగబాబు. అంతేకాదు సామాజిక అంశాల పై కూడా ఆయన స్పందిస్తూ ఉంటారు. ఆయన విశ్లేషించే పద్ధతి అందరికీ చేరువయ్యే విధంగానే ఉంటుంది.
Click Here To Watch NEW Trailer
ఈ మధ్యన తరచూ ఇన్స్టాలో ఆయన అభిమానులతో ముచ్చటిస్తూ కూడా ఉంటారు. ఒక్కోసారి ఆయన ఆవేశంలోనే మరే విధంగానో కానీ కొన్ని ఘాటు కామెంట్లను చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూ కూడా ఉంటారు. గతంలో బాలయ్య పై ఆయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వాటికి నాగబాబు ఇచ్చిన వివరణ కూడా అందరికీ తెలిసిందే. గతేడాది చివర్లో ఆయన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు వయసు గురించి చేసిన కామెంట్స్ కు తీవ్ర విమర్శల పాలయ్యారు.
ఇక తాజాగా ఈయన ఇన్స్టాలో అభిమానుల ప్రశ్నలకి జవాబులు ఇస్తూ.. చేసిన కామెంట్స్ కూడా విమర్శలకి దారితీసాయి.’ ‘ఆర్.ఆర్.ఆర్’ లో రాజమౌళి ఏం కత్తి వాడుతున్నారు సర్’ అని నెటిజెన్ వేసిన ప్రశ్నకి నాగబాబు ‘కోడి కత్తి’ అని సమాధానం ఇచ్చారు. ఇదే క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ ను ఫ్రీగా చూడాలి అంటే?’ అంటూ నెటిజెన్ అడిగిన ప్రశ్నకి నాగబాబు సమాధానమిస్తూ.. ‘చరణ్ బదులు నాని, ఎన్టీఆర్ బదులు శ్రీనివాస్, ఇక దర్శకుడు ఎవరో మీకు చెప్పనవసరం లేదు’ అంటూ నాగ బాబు జవాబిచ్చాడు.
ప్రాక్టికల్ గా నాగబాబు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు. కానీ హీరో నానిని ఆయన చిన్న చూపు చూసారు అంటూ కొందరు నాని అభిమానులు హర్ట్ అవుతున్నారు. అంతేకాదు ‘నాని ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ అయ్యాడు. కానీ మీరు మెగా ఫ్యామిలీ అయ్యుండి కూడా పీకింది ఏమీ లేదు.. మీరు మాత్రమే కాదు మీ కొడుకు వరుణ్ కంటే కూడా నాని ఓ మెట్టు పైనే ఉన్నాడు’ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!