బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో 11వ వారం గేమ్ రసవత్తరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని నేరుగా ఆడియన్స్ తో మాట్లాడేందుకు ఓట్ అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చాడు. దీనికోసం ప్రత్యేకంగా ఫ్లవర్స్ టాస్క్ పెట్టాడు. సీజన్ – 4లో పెట్టినట్లుగానే ఇప్పుడు కూడా ఫ్లవర్స్ టాస్క్ ని పెట్టాడు. దీనికోసం హౌస్ మేట్స్ పోటీ పడ్డారు. మొదటి రౌండ్ లో మిత్రా, ఇంకా బాబాభాస్కర్ మాస్టర్ లు అవుట్ అయ్యారు. బాబామాస్టర్ నటరాజ్ మాస్టర్ కి హెల్ప్ చేశారు.
అందుకే, గేమ్ లో నుంచీ అవుట్ అయ్యారు. కావాలనే తన ఫ్లవర్స్ ని నటరాజ్ మాస్టర్ మట్టిలో గుచ్చారు. దీంతో మాస్టర్ లీడింగ్ లోకి వచ్చారు. ఆ తర్వాత రౌండ్ లో శివ – బిందు ఇద్దరూ గేమ్ నుంచీ అవుట్ అయ్యారు. దీంతో అఖిల్, అనిల్, ఇంకా నటరాజ్ మాస్టర్ ముగ్గురు మాత్రమే మిగిలారు. నటరాజ్ మాస్టర్ కి కేవలం బాబాభాస్కర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంటే, మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా అనిల్ కి సపోర్ట్ చేశారు. దీంతో అనిల్ మట్టిలో 500లకి పైగా పూలు కలెక్ట్ అయ్యాయి.
నటరాజ్ మాస్టర్ దగ్గర కేవలం 300 పైచిలుకు మాత్రమే ఉన్నాయి. దీంతో మాస్టర్ ఆవేదన చెందారు. చాలా బాధపడ్డారు. అసలు టాస్క్ లో నాకు హౌస్ లో ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని ఫీల్ అయ్యారు. బాబాభాస్కర్ తో పాటుగా అఖిల్ చేస్తాడని మాస్టర్ ఆశపడ్డారు. కానీ, అఖిల్ అనిల్ కి సపోర్ట్ చేశాడు. గతంలో జరిగిన టాస్క్ లో అనిల్ కి హెల్ప్ చేయలేకపోయాననే భావనతో ఈసారి అఖిల్ అనిల్ వైపు నిలబడ్డాడు. ఈ విషయాన్ని మాస్టర్ జీర్ణించుకోలేకపోయారు.
అసలు హౌస్ లో నాకు సపోర్ట్ లేదని, సోలోగానే గేమ్ ఆడాను అని, నా బిడ్డ కోసం ఒళ్లు హూనం చేసుకుంటూ, కాళ్లు అరిగిపోయినా, కాళ్లు పని చేయకపోయినా గేమ్ ఆడుతున్నానంటూ రెచ్చిపోయి మరీ అరిచారు. పైనున్న దేవుడితో మాట్లాడుతూ, నన్ను చంపేయ్ లేదా టాప్ 5కి పంపీయ్ అంటూ గట్టి గట్టిగా అరిచారు. ఎవ్వరూ నా తరపున లేరు అని, దీనికోసం నేను ఇన్ని వారాలు పోరాడాను అని, ఒకవేళ ఫినాలేకి వెళ్లకపోతే నన్ను చంపేయ్ అంటూ బరెస్ట్ అయిపోయారు.
ఇక్కడ అఖిల్ తను ఎందుకు అలా చేశానో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, మాస్టర్ అప్పటికే బరెస్ట్ అయిపోయారు. బుర్రకి ఎక్కించుకునే మూడ్ లో లేరు. అరియానా కూడా వచ్చి మాస్టర్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడికి అందరూ గేమ్ ఆడేందుకు వచ్చారని, మీకు బాబాబాస్కర్ ఎలా సపోర్ట్ చేశారో, అనిల్ కి అఖిల్ అలాగే చేశాడని చెప్పింది. అంతేకాదు, 11 వారాలు మీరు ఇక్కడికి వచ్చారంటే ఆడియన్స్ సపోర్ట్ లేకుండానే వస్తారా అంటూ మాట్లాడింది.
అందరూ కష్టపడుతున్నారని, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయని మాస్టర్ కి మరోసారి గుర్తు చేసింది అరియానా. నిజానికి అరియానా మాట్లాడుతూ మాస్టర్ ని కూల్ చేసే ప్రయత్నం చేసింది, అలాగే చిన్నపాటి క్లాస్ కూడా పీకింది. బాబాభాస్కర్, అఖిల్ కూడా మాస్టర్ కి చెప్పే ప్రయత్నం చేశారు. కాసేపటి తర్వాత నటరాజ్ మాస్టర్ కూల్ అయ్యారు. మాస్టర్ గేమ్ ఓడిపోయినందుకంటే కూడా అఖిల్ అనిల్ కి సపోర్ట్ చేసినందుకు ఎక్కువగా ఫీల్ అయ్యారు. మొత్తానికి అదీ మేటర్.