నీకంటూ ఒక గుర్తింపు రాకముందు వరకూ ఎలాంటి పనులు చేసినా పర్లేదు కానీ.. నీకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత మాత్రం కొన్ని పనులు చేయకపోవడమే బెటర్ అనే విషయం కేవలం బిజినెస్ సర్కిల్స్ లో మాత్రమే కాదు సినిమాల పరంగానూ ఫాలో అవ్వాల్సిన విషయం. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకొన్న నయనతార ఈ ఫార్ములాను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. సరైన కథతో ఆమె సినిమా చేయాలే కానీ ప్రేక్షకులు అందులో హీరో ఉన్నాడా లేడా అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా థియేటర్లకు వచ్చేస్తున్నారు. అందుకు చక్కటి ఉదాహరణ “కోకిల, కర్తవ్యం” చిత్రాలు. నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ఈ రెండు చిత్రాలు ఘన విజయం సొంతం చేసుకున్న విధానం బట్టి ఆమె స్టార్ డమ్ అర్ధమవుతుంది.
కానీ.. నయనతార మాత్రం తనకు వచ్చిన స్టార్ డమ్ కంటే రెమ్యూనరేషణే ఇంపార్టెంట్ అన్నట్లుగా సినిమాలు ఒప్పుకుంటుంది. ఆమె రీసెంట్ ఫిలిమ్ “ఐరా” కానీ త్వరలో విడుదలకానున్న “మిస్టర్ లోకల్” కానీ కథ-కథనం ప్రకారం నయనతార స్థాయి నటి ఒప్పుకోవాల్సిన సినిమాలు కావు. అలాంటి సినిమాలు చేయడం వలన నయనతార తన రేంజ్ ను తగ్గించుకోవడమే కాదు స్టార్ డమ్ ను చేజేతులారా పాడుచేసుకొంటుంది. నయనతార ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే.. లేడీ సూపర్ స్టార్ గా ఆమె సంపాదించుకున్న పేరు, స్టార్ డమ్ కి వెల్యూ లేకుండాపోతుంది.