Ranabaali: ‘రణబాలి’కి లాస్ లేదంటున్నారు.. కలెక్షన్ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?
- October 26, 2026 / 03:06 PM ISTByFilmy Focus Desk
సినిమా విడుదల రోజే సక్సెస్ ప్రెస్మీట్లు, బాణసంచా కాల్చడాలు, సక్సెస్ ఇంటర్వ్యూలు, సక్సెస్ పోస్టులు, సక్సెస్ టాక్లు లాంటివి టాలీవుడ్లో మనం చూస్తూ ఉంటాం. ఆ సినిమా తొలి రోజు నాలుగు షోలు ఇంకా పడి ఉండవు. ఒక్కోసారి నాలుగు షోలు పడి ఉన్నా.. ఇంకా వసూళ్ల లెక్కలు తేలి ఉండవు. కానీ సినిమా నిర్మాతలు విజయ ప్రచారం షురూ చేస్తారు. ఇలాంటి ప్రచారాలు మన టాలీవుడ్లో చాలా చూసి ఉంటాం. అందులో మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా ఉన్నారు.
Ranabaali
గతంలో విజయం అందుకున్నా, అందుకోలేకపోయిన సినిమాలకు వారి ప్రచార హంగామా మనకు తెలుసు. అయితే ఇందులో తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ల సినిమా వాళ్ల ఇష్టం. బాగుందని ప్రచారం చేసుకుంటే ఓ నాలుగు టికెట్లు ఎక్కువ తెగొచ్చు. అయితే బాగోలేదు అని టాక్ వచ్చిన సినిమాకు బాగుంది అని టాక్ వచ్చిన సినిమా రేంజి వసూళ్లు వచ్చినప్పుడు కూడా ఆ సినిమా నుండి కలక్షన్స్ పోస్టర్స్ రావడం లేదు అంటే ఆలోచించాల్సిన విషయమే కదా.

రణబాలి’ సినిమా వసూళ్లపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ ఇటీవల స్పందిస్తూ, సినిమా దాదాపు అన్ని ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ సాధించిందని చెప్పారు. ఒకట్రెండు చోట్ల ఆశించిన వసూళ్ల రాలేదని కూడా చెప్పారు. అయితే సినిమాకు వచ్చిన స్పందన పట్ల తాము సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. ‘రణబాలి’ ఒక సూపర్ హిట్ అని ఆయన స్పష్టం చేశారు. ఇంత చెప్పిన సినిమాకు ఇప్పటివరకు వసూళ్ల పోస్టర్లు ఎందుకు వేయనట్లు.
సరైన టాక్ లేని సినిమాలకే టాలీవుడ్లో వందల కోట్ల రూపాయల వసూళ్ల పోస్టర్లు వేసి.. ఆ తర్వాత ఆ పోస్టర్లు నిజం కావు అని చెబుతున్న నిర్మాతలు ఉన్న టాలీవుడ్లో లాభాలు వచ్చిన సినిమాలకు వసూళ్ల పోస్టర్ లేకపోవడం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ నిర్మాణ సంస్థ పోస్టర్లు వ్యతిరేకమా అంటే గతంలో ఇలాంటి పోస్టర్లు వేశారు కూడా.















