చిరంజీవికి (Chiranjeevi) కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించినప్పుడు ఇతర ఇండస్ట్రీల్లోని ప్రముఖ నటులు స్పందించలేదు, వాళ్లు స్పందించలేదు, వీళ్లు మాట్లాడలేదు అని కొన్ని రోజుల క్రితం రకరకాల పుకార్లు వచ్చాయి. చిరంజీవి ఆ అవార్డు రావడం వాళ్లకు ఆనందం కలిగించలేదా అని ఆక్రోశం వ్యక్తం చేసినవాళ్లూ ఉన్నారు. ఆ విషయం ఏమో కానీ… ఓ నటుడికి దక్కిన ఆ గౌరవాన్ని తెలుగు నటీనటుల సంఘం సెలబ్రేట్ చేసుకుందా? ఈ మాటకు లేదనే ఆన్సరే వస్తుంది.
ఎందుకంటే చిరంజీవిని సన్మానించుకుందాం, మన వాడికి దక్కిన గౌరవాన్ని సంబరంగా మార్చుకుందాం అని ‘మా’కు అనిపించలేదు. ఈ మాట మేం అనేది కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానులు, సినిమా ప్రేక్షకులు అంటున్న మాట ఇది. పోనీ ‘మా’ తరఫు నుండి ఎలాంటి కార్యక్రమాలు ఇప్పుడు జరగడం లేదు కదా… ఇదెందుకు చేస్తారు అని అనొచ్చు. అయితే తెలుగు సినిమాకు 90 ఏళ్ల ఉత్సవం చేస్తాం అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ‘పద్మ విభూషణ్ చిరంజీవి’ సంగతేంటి అనే ప్రశ్న వినిపిస్తోంది.
ఆయనను సన్మానించుకునే, సత్కరించుకునే అవకాశం నటీనటుల సంఘం వద్దు అనుకుంటోందా అనే ప్రశ్న మొదలైంది. చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన తర్వాత చిత్రసీమ తరఫున వేడుక జరుగుతుందని అంతా అనుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అయితే తన పని తాను చేసింది. కానీ ‘మా’ నుండి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. పద్మవిభూషణ్ అనేది చిన్న విషయం కాదు. తెలుగు చిత్రసీమలో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) తరవాత చిరంజీవికే ఆ ఘనత దక్కింది. అలాంటప్పుడు ఆయన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
గతంలో చిరంజీవికి పద్మ భూషణ్ వచ్చినప్పుడు కదిలొచ్చిన ఇండస్ట్రీ ఈసారి లైట్ తీసుకుంది అనేదే ప్రశ్న. ‘నాకు సత్కారాలేం అవసరం లేదు. ప్రేక్షకుల అభిమానం చాలు’ అని చిరంజీవి పెద్ద మనసుతో చెప్పినా… చిరుని గౌరవించుకోలేకపోవడం లోటే. పోనీ ‘మా’లో ఆయన మీద ప్రేమ లేదు అనుకుందాం… మిగిలిన తెలుగు సినిమా విభాగాలు, సంఘాలు ఏమయ్యాయి. చిరంజీవి కోసం భారీ కార్యక్రమం చేపడతామని ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు (Dil Raju) అన్నారు. కానీ అదీ ఇంతవరకు అవ్వలేదు. మరిప్పుడైనా, ఎవరైనా కదులుతారేమో చూడాలి.
ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!
లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?