Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ పై టాలీవుడ్ హీరోల మౌనం ఎందుకో..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన పిల్లలు గౌతమ్, సితారల ఫోటోలు, సతీమణి నమ్రత ఫోటోలతో పాటు తన సినిమాల అప్డేట్లను అభిమానులతో పంచుకుంటారు. అంతేకాదు ఆయన ఏ సినిమానైనా చూస్తే కచ్చితంగా ఆ సినిమా పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు.’ఉప్పెన’ ‘జాతి రత్నాలు’ ‘వకీల్ సాబ్’ ‘పుష్ప’ ‘అఖండ’ ‘భీమ్లా నాయక్’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమాల పై ఆయన ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు వేశారు.

‘ఆచార్య’ సినిమాకి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు. కానీ నిన్న మహేష్ సినిమా ‘సర్కారు వారి పాట’ రిలీజ్ అయ్యింది. దీనికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. తీసిపారేసే సినిమా మాత్రం కాదు. మంచి మెసేజ్ తో పాటు మహేష్ నుండీ అభిమానులు, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆశించే కామెడీ ఉంది. మొదటి రోజు మంచి కలెక్షన్లను సాధించింది. చిత్ర బృందం కొంచెం ప్రమోట్ చేస్తే.. సమ్మర్ కి సినిమా నిలబడుతుంది. చిత్ర బృందాన్ని పక్కన పెట్టేసి టాలీవుడ్ బడా హీరోలు ఎవరైనా ఈ చిత్రం పై ఓ ట్వీట్ చేయడం వల్ల కూడా ప్రమోషన్ జరుగుతుంది.

నెగిటివ్ టాక్ ఆగుతుంది. కానీ ఏ హీరో కూడా అలా చేయడం లేదు. మహేష్ హిట్టు కొట్టడం వాళ్లకి ఇష్టం లేదా.. లేక మహేష్ సినిమా వాళ్ళకి నచ్చలేదా అన్నది వాళ్ళకే తెలియాలి. అయితే మహేష్ సూపర్ అంటూ ట్వీట్ చేసిన ‘ఉప్పెన’ కానీ ‘పుష్ప’ కానీ ‘అఖండ’ కానీ గొప్ప రివ్యూలు సాధించిన సినిమాలు ఏమీ కాదు. వాటికి కూడా మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. ‘సర్కారు వారి పాట’ సినిమాకి వచ్చిన రివ్యూలు రేటింగులే వాటికి కూడా వచ్చాయి.

అయినా మహేష్ తన వంతు ట్వీట్ సాయం చేశాడు. గతంలో మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రానికి ఒక్క చరణ్ తప్ప ఏ హీరో అప్రిషియేట్ చేయలేదు అని మహేష్ బహిరంగంగానే చెప్పాడు.అలాంటి సీనే ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. అయితే రిజల్ట్ ఆ రేంజ్లో ఉంటుందో లేదో చూడాలి..!

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus