అక్టోబరు నుండి సినిమా అన్నారు.. మరి ఏప్రిల్‌ 8ని అలా వదిలేశారేంటి?

అల్లు అర్జున్‌ (Allu Arjun)  సినిమాల లైనప్‌ మారింది. ఇక్కడ లైనప్‌ అనే కంటే.. రెడీగా ఉన్న రెండు ప్రాజెక్ట్‌ల ఆర్డర్‌ మారింది అనడం సరైన విధానమేమో. ఎందుకంటే బన్నీ కొత్త సినిమాలు అంటూ ఓ నాలుగైదు పేర్లు వినిపిస్తున్నా.. అందులో పక్కాగా ఓకే అయినవి మాత్రం రెండే. ఒకటి త్రివిక్రమ్‌ (Trivikram) సినిమా అయితే, రెండోది అట్లీ (Atlee Kumar)  సినిమా. సారీ సారీ ఒకటి అట్లీ సినిమా అయితే, రెండోది త్రివిక్రమ్‌ సినిమా. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏం మార్పు జరిగిందో.

 Trivikram, Allu Arjun

ఇండియన్‌ సినిమా తెరపై ఇలాంటి కథతో సినిమా ఇప్పటివరకు రాలేదు. పురాణాల్లోని ఓ అన్‌సంగ్‌ హీరో గురించి సినిమా తీయబోతున్నారు అంటూ గత కొన్ని నెలలుగా లీకులతో ఊదరగొడుతున్నారు. దానికి నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఎలివేషన్స్‌ ఇంకాస్త యాడింగ్‌. మొన్నీమధ్య ఆయన మాట్లాడుతూ అక్టోబరులో సినిమా స్టార్ట్‌ చేసేస్తాం. త్రివిక్రమ్‌ కథతో సిద్ధమవుతున్నారు అని చెప్పుకొచ్చారాయన. దీంతో ఏకంగా అట్లీ సినిమా ఉండదేమో అనే డౌటనుమానం ప్రేక్షకుల్లో వచ్చింది.

కట్‌ చేస్తే బన్నీ ఫ్యాన్స్‌కి స్పెషల్‌ డేట్‌ అయిన ఏప్రిల్‌ 8 వచ్చింది. ఆ రోజు త్రివిక్రమ్‌ సినిమా గురించి పూర్తి అప్‌డేట్‌ వస్తుంది.. దాంతో అట్లీ సినిమా గురించి క్లారిటీ వస్తుంది అనుకున్నారంతా. కట్‌ చేస్తే అట్లీ సినిమా గురించి అప్‌డేట్ వచ్చింది. త్రివిక్రమ్‌ సినిమా గురించి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అక్టోబరు స్టార్ట్‌ చేస్తామని చెబుతున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడం ఏంటి అనే చర్చ టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ వర్గాల్లో నడుస్తోంది.

నిజానికి త్రివిక్రమ్‌ సినిమాకే AA22 అనే నెంబరింగ్‌ తొలుత ఇచ్చారు. దీంతో అట్లీ సినిమాకు 23 ఉంటుంది అని అనుకున్నారంతా. కానీ ఆ నెంబరు త్రివిక్రమ్‌కి ఇచ్చారు అని సమాచారం. అయితే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా త్రివిక్రమ్‌ సినిమా టీమ్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో ఆ నెంబరు కూడా లేదు. దీంతో నాగవంశీ చెప్పిన అక్టోబరు నిజమేనా? అనేది తెలియాల్సి ఉంది. ఆ సైలెన్స్‌ వీడితేనే క్లారిటీ వస్తుంది.

తమిళ నిర్మాతలకు… మన నిర్మాతలకి అంత తేడా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus