‘దూరపు కొండలు నునుపు’ ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. మన టాలీవుడ్ నిర్మాతల విషయంలో ఇది కరెక్ట్ యాప్ట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సక్సెస్లో ఉన్న వాళ్లపైనే డబ్బులు పెడతామని వాళ్ళు తిష్ట వేసుకుని కూర్చున్నారు. పక్క రాష్ట్రాల్లో సక్సెస్ ఉన్న దర్శకులు (Directors), హీరోలు అయితే రెండింతల పారితోషికం ఇచ్చి మరీ తీసుకొచ్చి సినిమాలు చేస్తున్నారు. పోనీ అవేమైనా హిట్ అవుతున్నాయా? అంటే.. అబ్బే..!
ఒక్క మోహన్ రాజాని (Mohan Raja) తీసేస్తే.. మురుగదాస్ (A.R. Murugadoss), లింగుస్వామి (Lingusamy), వెంకట్ ప్రభు (Venkat Prabhu), శంకర్ (Shankar) వంటి స్టార్ డైరెక్టర్లపై భారీ బడ్జెట్లు పెట్టి మరీ సినిమాలు చేశారు మన నిర్మాతలు. వీళ్ళేమైనా మన వాళ్లకు హిట్స్ ఇచ్చారా? అంటే లేదు అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. తెలుగులో ఎంతో మంది టాలెంట్ ఉంది, సక్సెస్ ఇవ్వాలనే కసి ఉన్న దర్శకులకు మన నిర్మాతలు తొందరగా ఛాన్సులు ఇవ్వరు. అదే ఫేడౌట్ దశకి దగ్గరగా ఉన్న తమిళ దర్శకులపై వందల కోట్లు ఈజీగా పెట్టేస్తారు.
సరే బాగానే ఉంది. కానీ మన తెలుగు దర్శకులకి తమిళ నిర్మాతలు ఛాన్సులు ఇస్తారా? విజయ్ (Vijay Thalapathy) తో వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ‘వరిసు’ (Varisu) అనే సినిమా తీశాడు. దాన్ని మన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నిర్మించారు. అలాగే ధనుష్ (Dhanush) తో ‘సార్’ (Sir) చేశారు. దానికి నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మాత. ఇప్పుడు సూర్య చేస్తున్న స్ట్రైట్ తెలుగు మూవీ కూడా నాగవంశీ నిర్మిస్తుందే.
మన తెలుగు దర్శకులకి (Directors) తమిళ నిర్మాతలు ఛాన్సులు ఇవ్వడం లేదు. వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ తమిళ దర్శకులే. రాజమౌళితో (S. S. Rajamouli) తప్ప అక్కడి నిర్మాతలు వేరే దర్శకులతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. అక్కడి నిర్మాతలకి, మన నిర్మాతలకి అంత వ్యత్యాసం ఉంది.