భావప్రకటనా స్వేచ్ఛ… దీని గురించి మనం చాలాసార్లు విన్నాం, చదివాం, ఎవరో అంటుంటే తెలుసుకున్నాం కూడా. దీని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో ఉంది అనిపిస్తుంటుంది. ఎందుకంటే దీని అడ్డంటూ ఏమీ లేదు. ప్రతి విషయంలోనూ వచ్చేస్తుంది. దీనికి తోడు మరో పదం సినిమా స్వేచ్ఛ. ఇది కూడా అలాంటిదే. అంటే సినిమాల్లో మేం ఏదైనా చూపిస్తాం.. చూడటం చూడకపోవడం మీ ఇష్టం అని అంటుంటారు. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటే.. ఓటీటీలో పెచ్చు మీరుతున్న స్కిన్షో, నోటి జోరు, బెడ్ రూమ్ సీన్లు, మితిమీరిన హింస.
అయినా ఇదంతా మా మాట కాదు.. మీ మాట. అంటే నెటిజన్ల మాట. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న, వినిపిస్తున్న అంశాలను ఒక చోట చేర్చడమే మా ఉద్దేశం. సినిమాల్లో చర్చించలేని, చూపించలేని అంశాలను చూపించడానికి చాలామంది ఓటీటీలను వాడుకుంటున్నారు. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే మన సినిమాల్లో మన ఊహలకు అందని రూల్స్ ఉన్నాయి కాబట్టి. వాటిని మనం తప్పు పట్టలేం కూడా. అయితే చర్చించండి అంటూ ఓటీటీకి వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనికి ఉదాహరణలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి.
మాకూ విలువలు ఉన్నాయి, మేం మీరు అనుకుంటున్నట్లు కాదు.. అంటూ చాలామంది టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు చెబుతుంటారు. అయితే వాటకి విలువిచ్చి తొలుత ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలానే ఉంటున్నారా? అంటే ‘రానా నాయుడు’, ‘లస్ట్ స్టోరీస్ 2’ లాంటివి ఉదాహరణగా తీసుకుంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్లూ ఉన్న హోమ్లీ హీరో ఇమేజ్‌ను వెంకటేశ్ ‘రానా నాయుడు’తో పోగొట్టుకున్నారు. అందులో డైలాగ్‌లు, బూతులు, సీన్లు మరీ ఇబ్బందికరంగా అనిపించాయి. వెంకీ ఫ్యాన్స్‌కి అయితే ఆ సిరీస్ రక్తకన్నీరే.
ఇక స్కిన్ షో అంటే నడుము మాత్రమే చూపించడం అని చెప్పకనే చెప్పిన తమన్నా కూడ ఇప్పుడు రూటు మార్చింది. ఏకంగా 18 ఏళ్ల నో కిస్సింగ్ రూల్‌ను కూడా ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం పక్కన పెట్టేసింది. కొన్ని సీన్లు అయితే మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి. అదేంటి అలాంటి సీన్లు ఎవరూ చూడరా అంటే చూస్తారు.. కానీ ఎందుకలా విచ్చలవిడితనం చూపిస్తున్నారు అనేదే ప్రశ్న. ఇక ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌లో సమంత కూడా ఇలానే రెచ్చిపోబోతోంది అని టాక్. మరి మన వాళ్లు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో వారికే తెలియాలి.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్