టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన పనిలేదు…అయితే అదే క్రమంలో అన్న మెగాస్టార్ ను అనుసరిస్తూ …పవన్ కల్యాణ్ ఇండస్ట్రీకి వచ్చాడు…తొలి రోజుల్లో పవన్ ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు…ఇక యువ హీరోలు ఎవ్వరూ లేని సమయం…అదే క్రమంలో ఖుషీ, తొలిప్రేమ లాంటి లవ్ స్టోరీస్ లో ఒక్కసారిగా టాలీవుడ్ లో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు పవన్, ఇదిలా ఉంటే…ఆ హిట్స్ తరువాత కూడా పవన్ కరియర్ పెద్ద సాఫీగా సాగలేదు అనే చెప్పాలి…చాల్ గ్యాప్ తరువాత గబ్బర్ సింగ్ సినిమాతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన పవన్, తనకంటూ పక్కా మాస్ ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు…ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కల్యాణ్ అంటే అభిమానులకు దేవుడు లెక్క…అయితే ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు పవర్ స్టార్.
అదే క్రమంలో పవన్ లాస్ట్ మూవీ….‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ భారీ డిసాస్టర్ కావడంతో చేసేది ఏమీ లేక ఎలా అయినా హిట్ ఇవ్వాలి అని ఫక్తు కమర్షియల్ తమిళ కధని అరువు తెచ్చుకుని మరీ ట్రై చేస్తూ ఉండడం విశేషం…ఇదిలా ఉంటే….గత చిత్రం సర్దార్….విషయంలో చిత్రం రిలీజు కి రెండు నెలల ముందు తెలుగ, హిందీ ఇండస్ట్రీలో భారీగా ప్రమోషన్ వర్క్ చేశారు. దీంతో సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి..కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చప్పుడు చెయ్యకుండానే వెళ్లిపోయింది….. మరి ఆ రిసల్ట్ ప్రభావమొ ఏమో తెలీదు కానీ….సర్దార్ విషయంలో న్యాషనల్ మీడియాలో ఇంటర్వ్యూలు దంచి కొట్టినప్పటికీ…. అవేమీ వర్క్ అవ్వలేదు..బహుశా అందుకో ఏమో తెలీదు..కానీ….ఏమో కాటమరాయుడు సినిమా కోసం మినిమం ప్రమోషన్ లకి కూడా పవన్ ఆసక్తి చూపడం లేదు. ప్రమోషన్స్ కు చాలా దూరంగా ఉంటున్నాడు…మరి అది సినిమాపై పవన్ కు ఉన్న నమ్మకమో…లేక అతి నమ్మకమో…రేపు తేలనుంది…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.