Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

ప్రభాస్‌ సినిమాలకు సంబంధించి ఇటీవల రెండు ఈవెంట్లు జరిగాయి. అయితే అవి ప్రభాస్‌ ప్రమేయం లేకుండానే జరిగిపోవడం విశేషం. అదేంటి ప్రమేయం లేకపోవడం అంటున్నారా? కావాలంటే మీరే చూడండి ఆ కార్యక్రమాలకు ప్రభాస్‌ వచ్చాడా? కనీసం వస్తాడు, రాడు అనే బజ్‌ అయినా క్రియేట్‌ అయిందా. పోనీ రాలేకపోయాక ఎందుకు రాలేదు అనే సమాచారమైనా సినిమా టీమ్‌లు, పీఆర్‌వో టీమ్‌లు ఇచ్చాయా? వీటన్నింటికి ‘లేదు’ అనే సమాధానమే వస్తోంది.

Prabhas

ముందుగా ఏ ఈవెంట్లు జరిగాయి అనేది చూసి.. ఆ తర్వాత ఎందుకు రాలేదు అనే చూఛాయ కారణాలు చూద్దాం. ప్రభాస్‌ – సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్‌’ అనే సినిమా చాలా నెలల క్రితమే అనౌన్స్‌ అయింది. ఇదిగో, అదిగో అంటూ వాయిదాలు పడుతూ ఎట్టకేలకు సినిమా ముహూర్తం జరుపుకుంది. ఇటీవల ప్రముఖ హీరో చిరంజీవి వచ్చి సినిమాకు రైట్‌ రైట్‌ చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా చూశాం.

ఇక సంక్రాంతి బొమ్మ ‘ది రాజా సాబ్‌’ సినిమాకు సంబంధించి సాంగ్స్‌ లాంచ్‌లు జరుగుతున్నాయి. ‘రెబల్‌ సాబ్‌..’ అనే పాటను ఇటీవల టీమ్ విడుదల చేసింది. పాట భలేగా ఉంది అనే కితాబులు కూడా టీమ్‌కి దక్కాయి. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఈవెంట్లకు ప్రభాస్‌ అయితే రాలేదు. ‘రాజా సాబ్‌’ ఈవెంట్‌ లైవ్‌లో అయితే డార్లింగ్‌ కనిపించలేదు.

ఇక ‘స్పిరిట్‌’ సినిమా ముహూర్తం షాట్‌కి మీడియాను ఆహ్వానించలేదు. ఈవెంట్‌ అయ్యాక ఫొటోలు విడుదల చేశారంతే. అందులో ప్రభాస్‌ ఎక్కడా కనిపించలేదు. దీంతో ప్రభాస్‌ ఎందుకు బయటకు రావడం లేదు అనే ప్రశ్న మొదలైంది. శస్త్రచికిత్స (జరిగిందని సమాచారం) తర్వాత ఆయన బయటకు వచ్చింది ఒక్కసారే. అదీ ‘బాహుబలి: ది ఎపిక్‌’ సినిమా ప్రచారం కోసం ఓ వీడియో ఇంటర్వ్యూలో.

‘ఫౌజీ’ సినిమా లుక్‌ బయటకు రాకుండా ప్రభాస్‌ ఇలా లోప్రొఫైల్‌ మెయింటైన్‌ చేశాడు అని సన్నిహితులు చెబుతున్నారు. మరికొందరైతే ముహూర్తానికి వచ్చాడని అంటున్నారు. ఈ విషయంలో ఆయన టీమే రియాక్ట్‌ అవ్వాలి.

కాబోయే భార్యకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్…

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus