Bigg Boss 5 Telugu: ఈసారి అవి చిలుకపలుకులేనా బిగ్‌బాస్‌!

రెండో వారమో, మూడో వారమో అనుకుంటా… ప్రియ, వీజే సన్నీ మధ్య వైరం మొదలైంది. ఎందుకు, ఎవరు, ఎలా స్టార్ట చేశారు అనేది చర్చించకపోయినా… ప్రతి వారం ఈ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా ఏడో వారంలోనూ ఇదే పరిస్థితి. చిన్న విషయానికే రియాక్ట్‌ అవుతాడని, ఒక్కోసారి ఓవర్‌ రియాక్ట్‌ అవుతున్నాడని సన్నీకి పేరు. నాగార్జున కూడా ఇదే మాట చెప్పారు. మరోవైపు ప్రియ మాటలు, చేష్టలతో ప్రొవోక్‌ చేసే టైప్‌. దీంతో వీరి గొడవ ఆగడం లేదు.

ఏడో వారం నామినేషన్‌ సందర్భంగా ప్రియ చెప్పిన నామినేషన్‌ రీజన్‌ దగ్గర ప్రియ ప్రొవోకింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. అప్పుడు కామ్‌గా ఉన్న సన్నీ మంగళవారం ఎపిసోడ్‌లో కాస్త కంట్రోల్‌ తప్పాడు. అయితే దీనికి కారణం కూడా ప్రియనే. ఇంట్లో అంతమంది ఉండగా ప్రియ… సన్నీ బుట్టలో గుడ్లనే కొట్టేసింది. ఈ మాట పరోక్షంగా ఆమె దగ్గర అంటే… ‘బరా బర్‌ కొట్టేస్తా’ అని సమాధానమిచ్చింది. అక్కడితో ఆగకుండా గడ్డి పోచ తీసి… గాల్లోకి ఊది ‘నువ్వు గడ్డిపోచ’తో సమానం అని చెప్పింది.

ఆ తర్వాత కూడా ప్రియ – సన్నీ మధ్య ఈ మాటల యుద్ధం జరిగింది. ప్రియ కావాలనే ప్రొవోక్‌ చేస్తోందని సన్నీని హౌస్‌మేట్స్‌ కొందరు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కంట్రోల్‌ చేసుకుంటూ కాస్త కటువు మాటలు ఆడాడు సన్నీ. అయితే ఇక్కడ ఇంట్లో ప్రియ ఏమన్నా… బిగ్‌బాస్‌, నాగార్జున ఏమీ అనరు అనే విషయం సన్నీ మరచిపోయినట్లున్నాడు. గత కొన్ని వారాలుగా ప్రియ మాటలు వారికి చిలుకపలుకులులా వినిపిస్తున్నాయనే విషయం మనకు తెలిసిందే. అన్నట్లు బుధవారం ఎపిసోడ్‌లో వీరి గొడవ పీక్స్‌కి వెళ్లనుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus