మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ శృతి హాసన్ కాటంరాయుడు తర్వాత తెలుగులో ఏ సినిమా అంగీకరించలేదు. తమిళ భారీ చిత్రం సంఘమిత్ర కోసం అన్ని డేట్లు కేటాయించింది. అందులోంచి తప్పుకోవడంతో కొంత కాలం ఆమెకు విశ్రాంతి దొరికింది. దీంతో మీడియా కంటి కనబడకుండా దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈమె ఓ షో రూమ్ ప్రారంభోత్సవానికి హాజరైంది. అక్కడ ఆమెను చూసిన వారందరూ షాకయ్యారు. ఎప్పుడూ జీరో సైజ్ లో ఉండే శృతి బరువు పెరగడం చూసి ఆశ్చర్యపోయారు.
ఆ తర్వాత బొద్దుగా ఉన్న శృతి ని చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఈ లుక్ లో సూపర్ గా ఉంది. మామూలుగా బరువు పెరిగిందా? లేకుంటే ఏదైనా సినిమాలో రోల్ కోసమా? అని ప్రశ్నించుకోవడం అక్కడివారు వంతు అయింది. ప్రస్తుతం శృతి చేతిలో శెభాష్ నాయుడు సినిమా ఒకటే ఉంది. ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో సొంతంగా నిర్మిస్తున్నారు. ఇందులో కమల హాసన్ కి కూతురిగానే శృతి నటిస్తోంది. శృతి చేస్తున్నఇతర ప్రాజెక్ట్స్ గురించి బయటికి రాలేదు.