దర్శకదిగ్గజం బయోపిక్ విషయంలో అందరూ సైలెంట్ అయిపోయారెందుకు!

  • November 2, 2018 / 01:14 PM IST

ప్ర‌స్తుతం టాలీవుడ్ ను బ‌యోపిక్ ల ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. దాదాపు ఆర‌డ‌జ‌న్ పైగా బ‌యోపిక్ మూవీలు సెట్స్ పైన ఉన్నాయి. ఇక పోతే దాస‌రి నారాయ‌ణ రావు గారి బ‌యోపిక్ ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. ఆయ‌న కాలం చేశాక ఆయన శిష్యులు సినిమాను నిర్మిస్తాం అంటూ ప్ర‌క‌ట‌న‌లు సైతం చేశారు. అయితే దాసరి జయంతులు వస్తున్నాయి… వెళుతున్నాయి! కానీ మళ్లీ బయోపిక్ ప్రస్థావనే వినిపించడం లేదు. ఇప్పటివరకూ అందుకు సంబంధించిన ప్రయత్నాలు సాగుతున్న ఆనవాళ్లు కూడా కనిపించలేదు. కనీసం అధికారిక ప్రకటన ఏదైనా చేస్తారా? అన్న ఆశలు కూడా కనిపించలేదు.

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ అద్భుతమైన హిస్టరీని క్రియేట్ చేసుకున్న గ్రేట్ పర్సనాలిటీ దాస‌రి. మద్రాసు నుంచి హైదరాబాద్ కి పరిశ్రమను తరలించడంలో, అలానే హైదరాబాద్ లో పరిశ్రమ పాదుకొనేలా చేయడంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఏ ఇతర బయోపిక్ స్టార్లకు తీసిపోని అసాధారణ చరిత్ర ఉన్న గొప్ప మనిషి ఆయన. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా కొనసాగి ఎంతో ప్రజా ప్రయోజనకర పనులు చేశారు. కానీ ఆయన మరణానంతరం ఆయన శిష్యులే మరిచారా? అన్న విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus