స్టార్ ప్రొడ్యూసర్ ను పట్టించుకోని హీరోలు!

డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా మారి రెండు విభాగాల్లో సక్సెస్ అయిన దిల్ రాజు పరిస్థితి ఇప్పుడు కాస్త ఇబ్బందికరంగా మారింది. దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన గత చిత్రం ‘కృష్ణాష్టమి’ పెద్ద ప్లాప్ కావడం ఒక విషయం అయితే.. రవితేజతో మొదలుపెట్టిన సినిమా ఆగిపోవడం మరో విషయం. అయితే రవితేజతో ఆగిపోయిన సినిమాను నాగార్జునతో చేయాలని నిర్ణయం తీసుకుని చర్చలు జరపాలని అనుకున్నాడు దిల్ రాజు. దానికి మీడియా ముఖంగా సమయం దొరికితే దిల్ రాజుతో సినిమా చేస్తానని చెప్పాడు నాగార్జున.

కానీ లోపల మాత్రం విషయం వేరేలా ఉంది. నాగచైతన్యతో చేసిన జోష్ సినిమాతో రాజు పై నాగ్ నమ్మకం పోయిందని, అందువల్ల నాగార్జున దిల్ రాజుకు కలిసే అవకాసం కూడా ఇవ్వడం లేదట. అలాగే సోగ్గాడే క్రేజ్ ను దిల్ రాజుకు ఎలా క్యాష్ చేసుకుంటాడనే విషయంపై నాగ్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. నాగార్జునే కాదు, దిల్ రాజుకు దగ్గరైన మరోస్టార్ హీరో అల్లుఅర్జున్ కూడా దిల్ రాజును దూరంగా ఉంచుతున్నాడట. సినిమా వాళ్ళు దూరమవ్వడం, మళ్ళీ ఒక్కటయిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకెంత కాలం ఈ హీరోలు దిల్ రాజును దూరంగా పెడతారో చూద్దాం..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus