ఆ ముగ్గురు ఫిదా కథను ఎందుకు వదులుకున్నారు ?

  • July 19, 2017 / 12:43 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఫిదా. ఈ మూవీ టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి, ఎన్ఆర్ఐ కుర్రోడిగా వరుణ్ తేజ్ చక్కని నటనను ప్రదర్శించినట్లు ఈ వీడియోలు చెప్పకనే చెబుతున్నాయి. చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లోకి రానుంది. శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ స్టోరీని ముగ్గురు స్టార్ హీరోలు వదులుకున్నారని సమాచారం. అందులో మొదటి పేరుని డైరక్టర్ ఎప్పుడో చెప్పారు. అతను మహేష్ బాబు .. అతనికి కథ చాలా బాగా నచ్చినప్పటికీ కొత్త హీరో అయితే బాగుంటుందని సూచించినట్లు సమాచారం.

కథను రిజెక్ట్ చేసిన మరో ఇద్దరు మెగా హీరోలేనంట. మొదటిగా ఈ కథను దిల్ రాజు అల్లు అర్జున్ కి వినిపించారని, అతను వద్దని చెప్పేసరికి రామ్ చరణ్ వద్దకు వెళ్ళిందంట. అయితే అతను కూడా రిజెక్ట్ చేశారు. కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది. ఇది ఫీల్ గుడ్ స్టోరీ అయినప్పటికీ, తమ ఇమేజ్ కి మ్యాచ్ కాకపోతుందనే అనుమానంతో బన్నీ, చెర్రీ వదులుకున్నారని ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు. మరి విభిన్నకథలతో వెళ్తున్న వరుణ్ తేజ్ ఈ ఫిదా కథలో ఎంతలా ఇమిడిపోయాడో రెండు రోజుల్లో తెలిసిపోనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus