సినిమాలకు పైరసీ ఎంత పెద్ద సమస్యనో.. లీకేజీలు కూడా అంతే పెద్ద సమస్య. అయితే లీక్ అయ్యింది ఎంత, ఏమిటి, ఎలాంటిది అనేది ఇక్కడ విషయం. గతంలో ఓ పెద్ద సినిమా అయితే సగానికి సగం బయటకు వచ్చేసి చాలా ఇబ్బందిపడింది. అయితే రిలీజ్ అయ్యాక ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. కానీ సినిమా వచ్చేంతవరకు, విజయం సాధించేంతవరకు నిర్మాత చాలా భయపడి ఉంటారు. ఆ విషయం పక్కనపెడితే.. సినిమాలకు లీక్‌లు చాలా ఇబ్బందిగా మారుతున్నాయి అనేది ఇక్కడ విషయం.
ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో లీక్‌లు అంటే ఫైట్ సీన్స్, పాటలు లీక్ అవుతున్నాయి. పాటల విషయంలో అయితే ఎక్కువగా లీక్ అవుతున్నవి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ పాటలే. కావాలంటే మీరే చూడండి ఇటీవల కాలంలో లీక్ అయిన పాటలు చాలా వరకు తమన్ సంగీత దర్శకత్వంలో వస్తున్నవే. దీంతో తమన్ పాటలే ఎందుకు లీక్ అవుతున్నాయి, ఏం జరుగుతోంది అంటూ ఓ చర్చ బయటకు వచ్చింది. దీనిపై ఎవరైనా క్లారిటీ ఇస్తే బాగుండు అనే చర్చ కూడా జరుగుతోంది.
సుమారు నెల రోజుల క్రితం రామ్‌చరణ్ – శంకర్‌ల సినిమా ‘గేమ్ ఛేంజర్’లోని ఓ పాట ఆన్ లైన్‌లో అనధికారికంగా విడుదలైంది. అదేనండీ లీక్ అయ్యింది. పాట లీక్ అవ్వడం ఒకటైతే.. అందులోని లిరిక్ అర్థాలు తీసి రాద్ధాంతం చేయడం మరొకటి. ఆ పాట లీక్ సంగతి చూస్తే.. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమా పాట లీక్ అవ్వడమా అంటూ ఓ ప్రశ్న వినిపించింది. టాలీవుడ్‌లో చాలా గోప్యంగా సీక్రెట్‌లు, జాగ్రత్తగా కంటెంట్ ఉండే బ్యానర్లలో అదొకటి అంటారు.
ఇదిలా ఉండగా… ఇటీవల ‘గుంటూరు కారం’ సినిమాలోని ఓ పాట బిట్ ఇదే అంటూ ఓ సాంగ్ బయటకు వచ్చేసింది. క్లియర్‌గా లేకపోయినా ఆ సినిమాలోని పాటే అని చెబుతున్నారు. ఇక గతంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలోని ‘కళావతి..’ సాంగ్ కూడా ఇలాగే ఆన్ లైన్‌లో లీక్ అయిపోయింది. దీంతో ఈ మూడు విషయాలను ఒక దగ్గర పెట్టుకుని ఎందుకు తమన్ పాటలు ఇలా బయటకు వచ్చేస్తున్నాయి అని అడుగుతున్నారు.
అలా అని మిగిలిన సంగీత దర్శకులు, సినిమా టీమ్‌లు దీనిని సీరియస్‌గా తీసుకోవద్దా అంటే కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే టాలీవుడ్‌లో చాలా పెద్ద సినిమాలు ఇప్పుడు వరుసలో ఉన్నాయి. కాబట్టి తమన్ (Thaman) పాటల లీకేజీ పాఠాన్ని బాగా అర్థం చేసుకుని మిగిలిన సినిమాల టీమ్‌లు జాగ్రత్తపడాలి.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!