చిరంజీవి గురించి ఈ మధ్య ఎక్స్ మేథావులు చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ట్రీలో చిరంజీవి అందరికీ తొక్కేస్తారు అంటూ ఏవేవో ఉదహరణలు చెబుతూ ఉంటారు. వాటికి చిరంజీవి కాంపౌండ్ నుండి ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా దీటైన కౌంటర్లే వచ్చాయి. వాటికి రిప్లైలు ఇవ్వకుండా ఆ మేథావులు ఇప్పుడు కొత్త పాయింట్ పట్టుకున్నారు. మేం అన్న మాటలకు భయపడి చిరంజీవి ‘ఇరుముడి’ సినిమా గురించి మాట్లాడుతూ ‘అలా రాసుకొచ్చారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దీంతో చిరంజీవి మంచి మాట్లాడినా తప్పేనా అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చర్చకు దిగుతున్నారు. ఇంతకీ చిరంజీవి ‘ఇరుముడి’ గురించి ఏం రాశారంటే.. నాకెంతో ఇష్టమైన సోదరుడు రవితేజకు అభినందనలు. సినిమాను మొదటి నుండి చివరి వరకు ఆస్వాదించా. రవితేజ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా బాధ్యతను దర్శకుడు శివ నిర్వాణ తన భుజాలపై వేసుకుని గొప్పగా తీర్చిదిద్దారు. సున్నితమైన భావోద్వేగాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. బాలనటి నక్షత్రకు గొప్ప భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ‘ఇరుముడి’లో భాగమైన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు, నిర్మాతలకు అభినందనలు చెప్పారు.
ఇందులో అంత చర్చకు వచ్చే అంశం ఏముంది అనేగా డౌట్. చిరంజీవి పోస్టు ఆఖరున ‘‘ఈ పరిశ్రమ అందరిది.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి’’ అని రాసుకొచ్చారు. ఈ వాక్యాన్నే ఇప్పుడు కొంతమంది తప్పుడపడుతున్నారు. తన గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న విమర్శలకు కౌంటర్‌గానే చిరంజీవి ఇలా రాసుకొచ్చారు అంటున్నారు. నిజానికి ఈ మాట చిరంజీవి గతంలో కూడా చెప్పారు. అప్పుడు రాని తప్పు ఇప్పుడు వచ్చేస్తోంది.
ఒక పెద్ద సినిమా హిట్ అయితే.. దానిని చూసి కనీసం స్పందించని ‘టాప్ హీరో’లు ఉన్న ఇండస్ట్రీ మనది. జీవిత కాలంలో ఇలాంటి పరిస్థితి మనం ఎప్పుడూ చూడలేదు. అలా అని వారు ఎవరి విజయాన్ని చూసి ఆనందించలేరు అనుకోలేం కదా. అలా చిరంజీవి ప్రశంసను, మంచి మాటను తప్పుగా తీసుకుంటే ఎలా?