Trivikram: త్రివిక్రమ్‌ ఇలాంటి ఆలోచనలే ఎందుకు చేస్తున్నారు?

  • June 5, 2021 / 06:32 PM IST

కొంతమంది దర్శకుల సినిమాల్లో కొన్ని కామన్‌ పాయింట్స్‌ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకో కొన్నాళ్లకు అవి సెంటిమెంట్లుగా మారిపోతుంటాయి. అలాంటి దర్శకుల్లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఒకరు. ఆయన సినిమాల సెంటిమెంట్‌ గురించి మాట్లాడితే చాలానే కనిపిస్తాయి. అందులో మచ్చుకు కొన్ని చూస్తే… బ్యాగులు – హీరోలు, హీరోయిన్లకు ఆరోగ్య సమస్యలు, హీరోల హైడ్‌ అవుట్‌. మొదటి రెండూ చాలామంది చాలాసార్లు చెప్పారు. మూడోది మనం చూద్దాం! ఈ సెంటిమెంట్‌ తర్వాతి సినిమాలో కూడా ఉండబోతోందట.

త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన సినిమాలను ఒకసారి పరిశీలిస్తే… ఆయన హీరోలు ఏదో సందర్భంలో పేరు మార్చుకొనే, రూపు మార్చుకునో దాక్కుంటారు. అయితే అదంతా లోక కల్యాణం కోసమే. అలా హీరోలు దాక్కున్న గురూజీ సినిమాలు చూద్దాం. ‘అతడు’, ‘జల్సా’, ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘అల వైకుంఠపురములో…’. ఇదేంటి త్రివిక్రమ్‌ సినిమాల్లో చాలావరకు ఈ లిస్ట్‌లో వచ్చేశాయి కదా అంటారా.. మరి సెంటిమెంట్‌ అంటే అంతేమరి.

‘అల వైకుంఠపురములో..’లో తాత క్యారెక్టర్‌ ఓ మాట అంటాడు గుర్తుందా… ‘మీ నాన్న నిన్ను కొత్త పెళ్లి కూతురిలా దాచేశాడు.. ’ అని. ఆఁ.. అలాగే త్రివిక్రమ్‌ తన సినిమాలో హీరోను దాచేస్తుంటాడు. ‘అతడు’లో పార్థుగా మారి నాజర్‌ ఇంటికొస్తాడు. ‘జల్సా’లో నక్సలిజం నుండి బయటకు వచ్చి విద్యార్థిగా ఉంటాడు. ‘జులాయి’లో విలన్‌ సోనూసూద్‌కి చిక్కకుండా హైదరాబాద్‌ వెళ్లిపోతాడు. ‘అత్తారింటికి దారేది’లో కారు డ్రైవర్‌గా మారి సొంత అత్త ఇంటికి వెళ్తాడు.

‘అజ్ఞాతవాసి’లో ఎవరికీ తెలియకుండా మేనమామ దగ్గర బతుకుతాడు. ‘అరవింద సమేత..’లో వీరరాఘవకుడు అరవింద మాట తనకు దారి చూపిస్తోందని ఆమె దగ్గరే ఎవరో చెప్పకుండా ఉండిపోతాడు. ‘అల వైకుంఠపురములో..’లో అయితే రాజు బిడ్డ బంటుగా మారి మధ్య తరగతి కుటుంబంలో ఉండిపోతాడు. ఇదంతా త్రివిక్రమ్‌ హీరో గురించే. ఇప్పుడు తర్వాత మహేష్‌తో తీస్తున్న సినిమాలో కూడా త్రివిక్రమ్‌ హీరో పాత్రను దాస్తున్నారట.

ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ‘అతడు’ సినిమాను హీరో వెర్షన్లో చూపించబోతున్నారట. ‘అతడు’లో పార్థుగా వచ్చే మహేష్‌ పెద్ద కిల్లర్‌. అయితే ఇప్పుడు తీస్తున్న SSMB 28లో పార్థు పోలీసు ఆఫీసరట. ఏదో కారణం చేత తెలియన కుటుంబం దగ్గరకు వచ్చి కొన్నాళ్లు దాక్కుంటాడట. మరిది త్రివిక్రమ్‌ సెంటిమెంట్‌తో చేస్తున్నాడో. లేక కథ, పాత్రల అవసరం మేరకు చేస్తున్నారో… సినిమా చూస్తే కానీ తెలియదు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus