సగం పూర్తి కాని సినిమాలు కూడా రెండు పార్టులట… ఎందుకిలా చేస్తున్నారో?

ఒక్క సినిమాను పూర్తి చేయడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్న స్టార్‌ హీరోలు ఉన్న రోజులవి. మరీ ఏళ్లు కాకపోయినా ఆరేడు నెలలు పక్కా. అలాంటి ఈ సమయంలో పెద్ద సినిమాలు రెండు భాగాలవైపు ఆలోచనలు చేస్తున్నాయి. ఏముంది ఒకే కాంబినేషన్‌లో వెంట వెంటనే రెండు సినిమాలు చూసే అవకాశం వస్తుంది కదా అనొచ్చు. ఆ మాటా నిజమే కానీ.. ఈ రెండు ముక్కల కాన్సెప్ట్ అన్ని సినిమాలకు బాగోదు, అలాగే సరికాదు అనే వాదనలూ వినిపిస్తున్నాయి. అలాగే వాళ్లు చెప్పే రెండు ముక్కల వాదలను కూడా అంత నమ్మశక్యంగా లేవు.

టాలీవుడ్‌లో రెండు ముక్కలాట ఆడుతున్నట్లు తాజాగా ప్రకటించిన చిత్రం (Devara) ‘దేవర’. ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా ఇటీవలే మొదలైంది. గట్టిగా చూస్తే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. అయితే అప్పుడే సినిమాలో తీయలేని సన్నివేశాలు, డైలాగ్‌లు కనిపించాయని, రెండు భాగాలు చేస్తేనే బాగుంటుందని అనిపిస్తోందని, అందుకే రెండు భాగాలు చేసేస్తున్నామని కొరటాల శివ చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్‌ పూర్తయ్యాకనో, తుది దశకు వచ్చాకనో ఈ మాట చెబితే బాగుండేది.

ఇక ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ‘హరి హర వీరమల్లు’ సినిమాను కూడా రెండు భాగాలు చేస్తారని టాక్‌ వచ్చింది. అలాగే ‘ఓజీ’ సినిమాను కూడా రెండు భాగాలుగా తీసుకొస్తారనే పుకారు వచ్చింది. ‘సలార్‌’ రెండు భాగాలా అని అడిగితే ముందు వరకు కాదని చెప్పిన టీమ్‌… తొలి పార్ట్‌ టీజర్‌లో అదే మాట చెప్పింది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను కూడా రెండు పార్టుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని టాక్‌. ఇక విజయ్‌ దేవరకొండ – గౌత‌మ్ తిన్న‌నూరి సినిమాను ఇదే దారిలో తీసుకెళ్తున్నారట.

ఇదంతా చూస్తుంటే రెండు పార్టుల్లా వచ్చి హిట్లు కొట్టిన సినిమాలను చూసి వాతలు పెట్టుకుంటున్నారా? లేక అంత స్టఫ్‌ కథలో ఉందా అనే సందేహం రాకమానదు. రెండు పార్టుల కంటెంట్‌ సినిమాలో ఉంటే ఓకే… లేదంటే అనవసరంగా ఇబ్బందిపడతారు. అయితే ఇక్కడో విషయం రెండు పార్టులు అనే అంశం సినిమాకు హైప్‌ పెంచుతుంది. రెండు ముక్కలు వసూళ్లను డబుల్‌ చేస్తాయి. నిర్మాత మాత్రం దీని ద్వారా లాభపడతారు. ఫ్యాన్స్‌ కూడా. కానీ తేడా కొడితే అందరికీ లాస్‌.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus