నటన అన్న పదానికి అర్ధం తెలియని వారెందరో….వారసత్వం పేరుతో వరుస సినిమాల్లో నటిస్తూ…తాము హీరోలమే అని చెప్పుకుంటున్న ప్రస్తుత సినిమా పరిశ్రమలో నటన కోసం ఏమైనా చెయ్యవచ్చు…ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు…ఎలాంటి ఒత్తిళ్లను అయినా ఎదురించవచ్చు అని నిరూపించిన స్టార్స్ సైతం ఉన్నారు. ఇక అలాంటి వారిలో మన చియాన్ విక్రమ్ ఒకడు….తాను తన కరియర్ విషయంలో ఎంత కష్ట పడ్డాడో అందరికీ తెలిసిందే.
హీరోగా అతణ్ని నిలబెట్టిన ‘సేతు’ నుంచి.. గత ఏడాది వచ్చిన ‘ఐ’ వరకు ఆయా పాత్రల కోసం మామూలు కష్టం పడలేదు విక్రమ్. ఇదిలా ఉంటే విక్రమ్ గత చిత్రం ‘ఐ’ విషయంలో తాను పడ్డ కష్టం బహుశా ఇండియాలో మరే హీరో పడి ఉండడేమొ అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ సినిమాలో తాను పడ్డ కష్టం గురించి విక్రమ్ ఒక ఇంటెర్వ్యులో మాట్లాడుతూ….ఆ సినిమాకు చాలా కష్టపడాల్సి వచ్చింది అని, అందులోనూ మూడు క్యారెక్టర్స్ ఉన్న కధ కావడంతో….చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాను అని అన్నాడు విక్రమ్.
అదేలా అంటే…తొలుత బాడి బిల్డర్ పాత్రకు…..న్యాయం చేయడానికి…పది నెలలు పట్టే బాడి షేప్ ని కేవలం మూడు నెలల్లోనే రేయింబవళ్లు జిమ్ లోనే గడిపి సాధించాను అని, ఐతే స్టెరాయిడ్స్ తీసుకోలేదు. వేరే మార్గాలేమీ వెతకలేదు, కేవలం కష్టపడ్డానంతే అంటున్నాడు చియాన్. ఇక అదే క్రమంలో బక్క చిక్కిన పాత్రకు సైతం చాలా హార్డ్ వర్క్ చేశాడట. దాని గురించి చెబుతూ….సహజంగానే బరువు తగ్గాను. కడుపు మాడ్చుకున్నాను. ఫ్యాట్ బర్నర్ లాంటివేమీ వాడలేదు అని అంటున్నాడు…ఇక మోడ్‌లే పాత్రకు సైతం వర్కౌట్స్ చేశానని అంటున్నాడు విక్రమ్…తన కష్టం చూసి చాలా సార్లు దర్శకుడు శంకర్ సైతం ఇంత కష్టం అవసరమా అని అన్నట్లు తెలిపాడు. అయినా నా తృప్తి కోసం అని చేశాను అంటున్నాడు. ఇక తన ఇంట్లో వాళ్లయితే బక్కచిక్కినపుడు తన ముఖం చూడటానికే ఇష్టపడలేదు’’ అని బాధ పడ్డాడు విక్రమ్…ఏది ఏమైనా…ఇలాంటి నటులు చాలా అరుదుగా దొరుకుతారు…..