విజయ్ దేవర కొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి మూవీ సూపర్ హిట్ సాధించింది. బోల్డ్ మూవీగా పేరుతెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మంచి కలక్షన్ రాబట్టింది. ఇంతటి విజయం సాధించిన ఏ మూవీనైనా టీవీ చానల్స్ వాళ్ళు కోట్లు చెల్లించి సొంతం చేసుకుంటారు. కానీ అర్జున్ రెడ్డి విషయంలో ఇది భిన్నంగా ఉంది. శాటిలైట్ హక్కులకోసం ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ చిత్రంలో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నందున సెన్సార్ వాళ్లు “ఏ” సర్టిఫికెట్ ఇచ్చారు. అలా సర్టిఫికెట్ ఇచ్చినందుకు విజయ్ బహిరంగంగా విమర్శించారు.
ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా టీవీలో ప్రసారం కావాలంటే మరో సారి సెన్సార్ సభ్యుల ముందుకు సినిమా వెళ్ళాలి. వాళ్ళు అభ్యంతకర దృశ్యాలను తొలగిస్తేనే శాటిలైట్ హక్కుల కొనుగోలు జరుగుతుంది. అయితే ఇందులో చాలా సన్నివేశాలు, డైలాగ్స్ కత్తెరకు గురి అయ్యే అవకాశం ఉంది. దాదాపు గంట సినిమా కోత అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి మిగిలిన రెండు గంటల సినిమాని ఎవరు కొనుగోలు చేస్తారో .. ఇప్పుడే చెప్పడం కష్టం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.