Balakrishna: కన్ఫ్యూజ్ చేస్తున్న బాలయ్య.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తర్వాత బాలయ్య నటించే ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత లేదు. బాలయ్య జాబితాలో చాలామంది దర్శకులు ఉన్నా అధికారికంగా ప్రకటనలు మాత్రం రావడం లేదు. ఏ డైరెక్టర్ కు బాలయ్య ఓకే చెబుతారో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు..

బాలయ్య దర్శకుల ఎంపిక విషయంలో ఆలస్యం చేస్తే ఆయన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సినిమా సినిమాకు గ్యాప్ రావడం కంటే వేగంగా సినిమాల్లో నటించడం బాలయ్య కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. బాలయ్య ప్రస్తుతం 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా అనిల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా సక్సెస్ సాధిస్తే ఈ హీరో రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది.

బాలయ్య మాస్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూనే సినిమాలలో తన శైలి సన్నివేశాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ హీరో బాలకృష్ణ సినిమాలకు 70 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. బాలయ్య సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు సైతం రికార్డ్ రేటుకు అమ్ముడవుతున్నాయి. బాలయ్య తన శైలికి తగిన కథలను ఎంచుకుంటూనే యంగ్ డైరెక్టర్లతో పని చేస్తున్నారు.

కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సిద్ధమేనని బాలయ్య చెబుతుండగా అలాంటి కథలతో దర్శకులు బాలయ్యను సంప్రదిస్తారో లేదో చూడాల్సి ఉంది. నందమూరి మల్టీస్టారర్ దిశగా అడుగులు పడాలని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. నందమూరి అభిమానుల కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది. నందమూరి హీరోల సినిమాలకు ఊహించని రేంజ్ లో డిమాండ్ పెరుగుతోంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus