Taraka Ratna: బాలకృష్ణతో తారకరత్న ఆ మాట చెప్పేవారట.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ తారకరత్న పూర్తిస్థాయిలో కోలుకోవాలని పూజలు చేయిస్తున్నారనే సంగతి తెలిసిందే. తారకరత్న త్వరలో కోలుకుని సాధారణ మనిషి అవ్వాలని నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. అయితే తారకరత్నకు బాలయ్యతో కలిసి ఒక సినిమాలో నటించాలని కోరిక ఉందట. ఇప్పటికే బాలయ్య, కళ్యాణ్ రామ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ లా తాను కూడా బాలయ్యతో కలిసి నటించాలని చాలా సందర్భాల్లో తన మనస్సులోని కోరికను తారకరత్న వ్యక్తం చేశారని బోగట్టా.

బాలయ్య సైతం తన సినిమాలో తారకరత్నకు మంచి పాత్ర ఉంటే చెప్పాలని దర్శకులకు సైతం సూచించారని తెలుస్తోంది. బాలయ్య అనిల్ కాంబో మూవీలో తారకరత్న పేరును పరిశీలించారని వార్తలు జోరుగా వినిపించాయి. తారకరత్న కోలుకుంటే మాత్రం బాలయ్య తారకరత్న కాంబోను చూడవచ్చని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ పై బాలయ్య కూడా ఆసక్తిగా ఉన్నారని సమాచారం. తారకరత్న కోలుకుంటే ఈ కాంబినేషన్ ను చూడటానికి ఎంతో సమయం పట్టదని తెలుస్తోంది.

బాలయ్య త్వరలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ రెగ్యులర్ షూట్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్లు ఉండనున్నాయని వింటేజ్ బాలయ్యను అనిల్ రావిపూడి ఈ సినిమాలో చూపించనున్నారని సమాచారం. బాలయ్య అనిల్ కాంబో మూవీకి సంబంధించి మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ ను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది. దిల్ రాజు భారీ మొత్తం ఆఫర్ చేసి ఈ సినిమా నైజాం రైట్స్ ను కొనుగోలు చేశారు.

వరుస విజయాల వల్ల బాలయ్య సినిమా హక్కులకు మంచి డిమాండ్ పెరిగింది. సినిమా సినిమాకు బాలయ్య మార్కెట్ పెరుగుతుండటంతో ఆయన సినిమాల హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. బాలయ్య సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus